News March 19, 2025
పెళ్లి చేసుకోనున్న స్టార్ హాకీ ప్లేయర్లు

భారత జాతీయ హాకీ జట్టు ప్లేయర్లు మన్దీప్ సింగ్, ఉదితా దుహాన్‌లు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. మైదానంలో తమ ప్రదర్శనతో దేశం మొత్తం గర్వపడేలా చేసిన ఈ జంట ఈనెల 21న పెళ్లి చేసుకోనున్నారు. పంజాబ్‌లోని జలంధర్‌లో వీరి వివాహం జరగనున్నట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఇప్పటికే పెళ్లికి ముందు జరిగే తంతు ప్రారంభమైనట్లు తెలిపాయి. కరోనా సమయంలో వీరి మధ్య ఏర్పడిన స్నేహబంధం ప్రేమగా మారింది.
Similar News
News March 20, 2025
సంతోషాన్ని పంచుకోండి మామా!

సంతోషాన్ని కొని తెచ్చుకుంటున్నాం. ఒకానొకప్పుడు సంతోషం అంటే మనుషుల మాటల్లో, వారు పంచే ఆప్యాయతలో ఉండేది. ఇప్పుడు వస్తువుల్లో సంతోషాన్ని వెతుక్కుంటున్నాం. పక్కనున్న వ్యక్తి సంతోషాన్ని చూసి కొందరు కుళ్లుకుంటున్నారు. ఉన్నది ఒకటే జిందగీ.. ఇకనైనా ఇలాంటివి మాని సంతోషాన్ని ఇతరులతో పంచుకుందాం. ఒక చిరునవ్వు, మంచి మాట, చిన్న సహాయం చేసి ఎదుటివారి సంతోషానికి కారణం అవుదాం. ఈరోజు వరల్డ్ హ్యాపీనెస్ డే.
News March 20, 2025
ఈ అవార్డుతో నా హృదయం ఉప్పొంగింది: చిరు

UK పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో పార్లమెంట్ సభ్యులు, మంత్రుల నుంచి అవార్డు అందుకోవడంతో తన హృదయం ఉప్పొంగిపోయిందని మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ‘బ్రిడ్జ్ ఇండియా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు రావడం సంతోషంగా ఉంది. ఈ గౌరవం మరింత శక్తితో నా పనిని కొనసాగించడానికి ప్రేరేపిస్తుంది. నా ప్రయాణంలో తోడున్న, నా సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు’ అని పేర్కొన్నారు.
News March 20, 2025
OFFICIAL: చాహల్, ధనశ్రీ విడాకులు

భారత క్రికెటర్ చాహల్, ధనశ్రీ విడాకుల పిటిషన్‌పై ముంబైలోని ఫ్యామిలీ కోర్టు తీర్పునిచ్చింది. వీరికి విడాకులు మంజూరు చేసింది. దీనికోసం ధనశ్రీకి రూ.4.75 కోట్లు భరణం చెల్లించేందుకు చాహల్ ఇప్పటికే అంగీకరించారు. అందులో కొంత మొత్తాన్ని కూడా అందించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ తీర్పు కోసమే చాహల్ IPL జట్టులో ఇంకా చేరకుండా ఉన్నారు.