News March 19, 2025
పెళ్లి చేసుకోనున్న స్టార్ హాకీ ప్లేయర్లు

భారత జాతీయ హాకీ జట్టు ప్లేయర్లు మన్దీప్ సింగ్, ఉదితా దుహాన్‌లు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారు. మైదానంలో తమ ప్రదర్శనతో దేశం మొత్తం గర్వపడేలా చేసిన ఈ జంట ఈనెల 21న పెళ్లి చేసుకోనున్నారు. పంజాబ్‌లోని జలంధర్‌లో వీరి వివాహం జరగనున్నట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఇప్పటికే పెళ్లికి ముందు జరిగే తంతు ప్రారంభమైనట్లు తెలిపాయి. కరోనా సమయంలో వీరి మధ్య ఏర్పడిన స్నేహబంధం ప్రేమగా మారింది.
Similar News
News April 22, 2025
లిక్కర్ స్కామ్‌లో నా పాత్ర విజిల్ బ్లోయర్: VSR

AP: లిక్కర్ స్కామ్‌లో తాను ఒక్క రూపాయీ ముట్టలేదని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. ‘ఏపీ లిక్కర్ స్కామ్‌లో నా పాత్ర విజిల్ బ్లోయర్(సమాచారాన్ని బహిర్గతం చేసే వ్యక్తి). దొరికిన దొంగలు, దొరకని దొంగలు తప్పించుకునేందుకే నా పేరును లాగుతున్నారు. ఏ రూపాయి నేను ముట్టలేదు. లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు. వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను’ అని తెలిపారు.
News April 22, 2025
హిందీ ఇంపోజిషన్: ఫడణవీస్ వ్యాఖ్యలపై స్టాలిన్ సెటైర్లు

హిందీయేతర రాష్ట్రాల్లో హిందీ ఇంపోజిషన్‌పై తీవ్ర వ్యతిరేకతను చూసి మహారాష్ట్ర సీఎం ఫడణవీస్ భయపడ్డారని తమిళనాడు సీఎం స్టాలిన్ ఎద్దేవా చేశారు. అందుకే మహారాష్ట్రలో కేవలం మరాఠీ తప్పనిసరంటున్నారని విమర్శించారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఆయనకు అధికారికంగా చెప్పిందా అని ప్రశ్నించారు. అదే నిజమైతే మూడో భాషా బోధన తప్పనిసరి కాదంటూ అన్ని రాష్ట్రాలకు స్పష్టమైన ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు.
News April 22, 2025
ఒక్కరోజే రూ.2,750 పెరిగిన తులం బంగారం

బంగారం ధరలు సరికొత్త మైలురాయి చేరాయి. హైదరాబాద్‌లో ఇవాళ 10 గ్రాముల 24క్యారెట్ల పసిడి ₹1649 పెరిగి ₹1,00,000కు చేరింది. ఇక 22 క్యారెట్ల పుత్తడి కూడా 10గ్రాములకు ₹2,750 పెరిగి తొలిసారి ₹92,900కు చేరింది. అటు KG వెండి ₹1,11,000గా ఉంది. విజయవాడ, విశాఖ సహా రెండు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి. అంతర్జాతీయ ఒడిదుడుకులతో బంగారంపై పెట్టుబడికి డిమాండ్, స్థానిక వివాహాల సీజన్ ఈ ధరల ధగధగకు ప్రధాన కారణాలు.