News March 20, 2025
BREAKING: ఇద్దరు ఎమ్మెల్యేలకు గాయాలు

AP: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన క్రీడా పోటీల్లో ఇద్దరు MLAలు, ఓ MLC గాయపడ్డారు. రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి కబడ్డీ ఆడుతూ వెనక్కి పడిపోవటంతో తలకు స్వల్పగాయమైంది. అలాగే రైల్వేకోడూరు MLA అరవ శ్రీధర్ కూడా కబడ్డీ ఆడుతూ కిందపడిపోయారు. దీంతో ఆయన కాలు ఫ్రాక్చర్ అయింది. క్రికెట్ ఆడుతూ MLC రాంభూపాల్ రెడ్డి కింద పడిపోయారు. వీరందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Similar News
News March 20, 2025
సినీ ఇండస్ట్రీకి మహిళా కమిషన్ వార్నింగ్

TG: సినిమా పాటల్లో డాన్స్ స్టెప్స్ అసభ్యకరంగా, మహిళలను కించపరిచేలా ఉన్నాయని ఫిర్యాదులు వచ్చాయని రాష్ట్ర మహిళా కమిషన్ పేర్కొంది. సినిమా అనేది సమాజంపై ప్రభావం చూపే మాధ్యమమని, మహిళలను అవమానించే అంశాలు తీవ్ర ఆందోళనలకు గురిచేస్తున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో సినీ దర్శకులు, నిర్మాతలు, కొరియోగ్రాఫర్లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హెచ్చరికలు జారీ చేసింది. ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
News March 20, 2025
ధోనీయా మజాకా… యాడ్ వీడియో భారీ సక్సెస్

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ చేసిన <<15801433>>యాడ్<<>> భారీ విజయం పొందిందని సదరు ఈ-సైకిల్ కంపెనీ సీఈవో కునాల్ గుప్తా ట్వీట్ చేశారు. కేవలం 24 గంటల్లోనే యాడ్ వీడియోకు 50 మిలియన్ల వ్యూస్ వచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఇది మాస్టర్ స్ట్రోక్ అని, వ్యూస్ పెరుగుతుండటం చూస్తుంటే సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు. కాగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘యానిమల్’ లుక్‌లో తలా నటించిన విషయం తెలిసిందే.
News March 20, 2025
వరల్డ్ బెస్ట్ బ్రెడ్ మన ఇండియాదే!

ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ గైడ్ ‘టేస్ట్ అట్లాస్’ మార్చి-2025 ర్యాంకింగ్స్‌ను విడుదల చేసింది. ఇందులో భారతదేశపు ‘బటర్ గార్లిక్ నాన్’ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్రెడ్‌గా నిలిచింది. ఇది 4.7 రేటింగ్‌తో ప్రథమ ర్యాంకును పొందింది. ఆ తర్వాత అమృత్‌సర్‌కు చెందిన ‘కుల్చా’కు రెండు, పరోటాకు ఆరో స్థానం లభించింది. కాగా, 8వ ర్యాంకులో ‘నాన్’, 18లో ‘పరాఠా’, 26లో ‘భతురా’, 28లో ‘ఆలూ నాన్’, 35 ర్యాంకులో ‘రోటీ’ ఉన్నాయి.