News March 20, 2025
BREAKING: ఇద్దరు ఎమ్మెల్యేలకు గాయాలు

AP: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన క్రీడా పోటీల్లో ఇద్దరు MLAలు, ఓ MLC గాయపడ్డారు. రాజమండ్రి రూరల్ MLA గోరంట్ల బుచ్చయ్య చౌదరి కబడ్డీ ఆడుతూ వెనక్కి పడిపోవటంతో తలకు స్వల్పగాయమైంది. అలాగే రైల్వేకోడూరు MLA అరవ శ్రీధర్ కూడా కబడ్డీ ఆడుతూ కిందపడిపోయారు. దీంతో ఆయన కాలు ఫ్రాక్చర్ అయింది. క్రికెట్ ఆడుతూ MLC రాంభూపాల్ రెడ్డి కింద పడిపోయారు. వీరందరినీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Similar News
News April 25, 2025
అల్లు అర్జున్ సినిమాలో మృణాల్?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు జోడీగా ‘సీతారామం’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ నటించనున్నట్లు తెలుస్తోంది. అట్లీ తెరకెక్కించే సినిమాలో ఈ ముద్దుగుమ్మ నటిస్తారని సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై మూవీ యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా జూన్ తర్వాత సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. సన్ పిక్చర్స్ ఈ మూవీకి నిర్మాణ సంస్థగా వ్యవహరించనుంది.
News April 25, 2025
పాకిస్థానీయులను వెనక్కి పంపండి.. షా ఆదేశాలు

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. పాక్ దేశస్థులను గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు. ఈ విషయమై ఆయా రాష్ట్రాల సీఎంలకు ఫోన్ చేశారు. ఇప్పటికే పాకిస్థానీయుల వీసాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. కాగా హైదరాబాద్‌లో 200 మందికి పైగా పాకిస్థానీయులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో హైఅలర్ట్ ప్రకటించి, వారిని వెనక్కి పంపేందుకు చర్యలు చేేపట్టారు.
News April 25, 2025
ఆర్మీ కంటపడ్డాడు.. ఖతమయ్యాడు

లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లీని భారత సైన్యం <<16209767>>మట్టుబెట్టిన<<>> విషయం తెలిసిందే. పహల్గామ్ దాడి నిందితుల కోసం ఆర్మీ, J&K పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టగా అల్తాఫ్ వారి కంటపడ్డాడు. దీంతో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఆర్మీ ఫైరింగ్‌లో అల్తాఫ్ హతమయ్యాడు. అటు కశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం ముమ్మర గాలింపు కొనసాగుతోంది. ఆర్మీ చీఫ్ ద్వివేది అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.