News March 20, 2025
చంద్రబాబు SC వర్గీకరణ రూపకర్త: పవన్ కళ్యాణ్

AP: SC వర్గీకరణకు CM చంద్రబాబు ఆద్యుడు, రూపకర్త అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఎస్సీ వర్గీకరణకు నాంది పలికిన చంద్రబాబుకు ధన్యవాదాలని అసెంబ్లీలో చెప్పారు. ‘ఎస్సీ వర్గీకరణతో అందరికీ మేలు జరుగుతుంది. వర్గీకరణ బిల్లుకు మనస్ఫూర్తిగా ఆమోదం పలుకుతున్నాం. ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే చంద్రబాబు, మందకృష్ణే కారణం. మాదిగల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత మందకృష్ణదే’ అని ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 30, 2025
సర్వికల్ క్యాన్సర్ లక్షణాలివే..

గర్భాశయ క్యాన్సర్ సాధారణంగా మానవ పాపిల్లోమావైరస్ (HPV) వల్ల వస్తుంది. యోని రక్తస్రావం, యోనిలో మార్పులు, సెక్స్ సమయంలో నొప్పి, తుంటి భాగంలో నొప్పి వస్తుంటే అవి సర్వికల్ క్యాన్సర్ లక్షణాలు కావొచ్చు. ఈ లక్షణాలుంటే పాప్ స్మెర్మ్, HPV పరీక్షలు చేయించుకోవాలి. HPV అట్-హోమ్ సెల్ఫ్-టెస్టింగ్ కిట్లు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. 25 ఏళ్లు పైబడిన మహిళలు ఈ టెస్టులు చేయించుకోవడం మంచిది.
News December 30, 2025
రేపే వదిలేసెయ్..!

బద్ధకం, కోపం, సహనం లేకపోవడం, అతిగా ఆలోచించడం, నలుగురిలో ధైర్యంగా మాట్లాడలేకపోవడం.. ఇలా ఏదో ఒక సమస్య మీ ఎదుగుదలను అడ్డుకుంటోందా? అయితే దాన్ని అధిగమించేందుకు ఇదే మంచి తరుణం. రేపటితో ఈ ఏడాది ముగుస్తుంది. మీ బలహీనతను వదిలేసి ఎల్లుండి మొదలయ్యే నవ వసంతంలోకి కొత్తగా అడుగుపెట్టండి. మీరు ‘పర్ఫెక్ట్’ అనుకుంటే మార్పు చూడాలనుకుంటున్న వారికి దీన్ని షేర్ చేసేయండి.. Advance Happy New Year చెప్పేయండి.
News December 30, 2025
Fb: ప్రపంచ కుబేరుడు.. అప్పుతో ఇంటి రెంట్ పే

ప్రపంచ కుబేరుడు మస్క్ ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్తే 2008లో ఫ్రెండ్స్ అప్పు ఇస్తే రూమ్ రెంట్ పే చేశారు. అప్పట్లో స్పేస్ ఎక్స్‌లో భారీ పెట్టుబడి, ఇటు టెస్లా కార్ల సేల్స్ లేక అప్పులే మిగిలాయి. పైగా క్వాలిటీ లేదని భారీగా కార్లు రీకాల్ చేసే పరిస్థితి. మొదటి భార్య విడాకుల సమస్యా అప్పుడే. ఆ పర్సనల్, ప్రొఫెషనల్ టఫ్ టైమ్‌లో మానసికంగా వీక్ అయితే..? కానీ పరిస్థితిని ఎదుర్కొన్నారు కాబట్టే నేడు బిగ్గా నిలబడ్డారు.


