News March 20, 2025

చంద్రబాబు SC వర్గీకరణ రూపకర్త: పవన్ కళ్యాణ్

image

AP: SC వర్గీకరణకు CM చంద్రబాబు ఆద్యుడు, రూపకర్త అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఎస్సీ వర్గీకరణకు నాంది పలికిన చంద్రబాబుకు ధన్యవాదాలని అసెంబ్లీలో చెప్పారు. ‘ఎస్సీ వర్గీకరణతో అందరికీ మేలు జరుగుతుంది. వర్గీకరణ బిల్లుకు మనస్ఫూర్తిగా ఆమోదం పలుకుతున్నాం. ఎస్సీ వర్గీకరణ ఈ స్థాయికి వచ్చిందంటే చంద్రబాబు, మందకృష్ణే కారణం. మాదిగల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఘనత మందకృష్ణదే’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News April 21, 2025

కొడాలి నాని హెల్త్ అప్డేట్

image

AP: గుండె సంబంధిత ఆపరేషన్ చేయించుకున్న వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని ప్రస్తుతం కోలుకుంటున్నట్లు ఆయన కుటుంబసభ్యులు తెలిపారు. కొద్దిరోజుల క్రితం ముంబైలోని ప్రైవేటు ఆసుపత్రిలో ఆయనకు హార్ట్ సర్జరీ జరగగా అనంతరం హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. త్వరలోనే ప్రజల ముందుకు వస్తారని సన్నిహితులు చెబుతున్నారు.

News April 21, 2025

రాహుల్ ద్వంద్వ పౌరసత్వం కేసు.. కేంద్రానికి హైకోర్టు కీలక ఆదేశాలు

image

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ద్వంద్వ పౌరసత్వం కేసులో కేంద్ర హోంశాఖకు అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. 10 రోజుల్లో ఆయన పౌరసత్వంపై తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో తదుపరి విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేసింది. ఆయనకు బ్రిటిష్ పౌరసత్వం కూడా ఉందని, దీంతో భారత్‌లో ఎన్నికల్లో పోటీ చేసే అర్హత లేదని పిటిషనర్ హైకోర్టును ఆశ్రయించారు.

News April 21, 2025

మే రెండో వారంలో ‘హరిహర వీరమల్లు’ రిలీజ్?

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు కిక్కిచ్చే న్యూస్. ఆయన నటిస్తోన్న ‘హరిహర వీరమల్లు’, ‘OG’ సినిమాల విడుదలకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. HHVM వచ్చే నెల రెండు లేదా మూడో వారంలో విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈలోగా మిగిలిన చిత్రీకరణతో పాటు డబ్బింగ్ పనులు పూర్తి చేయాలని చూస్తున్నట్లు పేర్కొన్నాయి.

error: Content is protected !!