News March 20, 2025
ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌కు వర్షం ముప్పు?

IPL ఫ్యాన్స్‌కు తొలి మ్యాచ్‌లోనే నిరాశ ఎదురయ్యేలా కనిపిస్తోంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో KKR, RCBకి మధ్య ఎల్లుండి జరగనున్న మ్యాచ్‌కు వర్షం ముప్పు 90శాతం మేర ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ బెంగాల్‌లో వచ్చే కొన్ని రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది. ఒకవేళ వర్షం కారణంగా పూర్తి మ్యాచ్ రద్దైతే ఇరు జట్లూ పాయింట్లు పంచుకుంటాయి.
Similar News
News March 28, 2025
కుప్పకూలిన 1000 పడకల ఆసుపత్రి.. భారీగా క్షతగాత్రులు

భూకంప తీవ్రతకు మయన్మార్ రాజధాని నేపిడాలో 1,000 పడకల ఆసుపత్రి కుప్పకూలింది. ఇందులో పెద్ద ఎత్తున క్షతగాత్రులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మండలే నగరంలో ఒక వంతెన కూలిపోయింది. పలు చోట్ల ఎత్తైన భవనాలు, గుళ్లు నేలకొరిగాయి. ఇప్పటి వరకూ 55మంది మృతి చెందినట్లు అధికారులు తెలుపగా సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. బ్యాంకాక్‌లో భారీ భవనం కూలడంతో ముగ్గురు మృతి చెందగా పదుల సంఖ్యలో శిథిలాల కింద చిక్కుకున్నారు.
News March 28, 2025
రూ.లక్ష లంచం తీసుకుంటూ దొరికిన జిల్లా రిజిస్ట్రార్

AP: కాకినాడ జిల్లా రిజిస్ట్రార్ ఆనందరావు, అసిస్టెంట్ శ్రీనివాసరెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. రూ.లక్ష లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తన భార్య పేరిట ఉన్న గ్యాస్ ఏజెన్సీని తన పేరు మీదకు మార్చాలంటూ తునికి చెందిన రమేశ్‌బాబు రిజిస్ట్రార్‌ను ఆశ్రయించారు. ఇందుకు ఆయన రూ.లక్ష డిమాండ్ చేయడంతో రమేశ్ ఏసీబీకి సమాచారమిచ్చారు. దీంతో నిఘా వేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
News March 28, 2025
2000km దూరం నుంచి గుండె ఆపరేషన్ చేసిన డాక్టర్లు

గురుగ్రామ్ డాక్టర్లు 2000km దూరంలోని బెంగళూరులో రోగికి అత్యంత సంక్లిష్టమైన గుండె ఆపరేషన్ చేశారు. SS ఇన్నోవేషన్స్ రూపొందించిన స్వదేశీ సర్జికల్ రోబో SSI మంత్ర సాయంతో సర్జరీని విజయవంతం చేశారు. కన్సోల్ వెనక కూర్చున్న డాక్టర్లు 3D గ్లాసెస్ పెట్టుకొని స్క్రీన్ చూస్తూ 2:40hrs శ్రమించారు. BLR డాక్టర్లు ఇక్కడ రోబోను అమర్చారు. గతంలో 48KM, 286KMకే సాధ్యమైన టెలీసర్జరీ 2000KM దూరాన చేయడం ఇదే తొలిసారి.