News March 20, 2025
జనగామ: పదో తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి: డీఈవో

శుక్రవారం ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈవో రమేశ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని మొత్తం 41 పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు, తాగునీటి వసతి, మూత్ర శాలలు, బెంచీలు, ఫ్యాన్లు, తదితర వసతులన్నీ కల్పించినట్లు తెలిపారు. విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా సర్వం సిద్ధం చేసినట్లు వెల్లడించారు.
Similar News
News March 29, 2025
HYD: జీహెచ్ఎంసీ కొత్త యాప్.. ఆన్ లైన్ చలాన్ !

హైదరాబాద్ నగర పరిశుభ్రతను మెరుగు పరిచేందుకు జీహెచ్ఎంసీ త్వరలో కొత్త యాప్‌ను ప్రారంభించనుంది. ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ రూపొందించిన ఈ యాప్ ద్వారా చెత్త నిర్వాహణ మరింత సమర్థంగా మారనుంది. ఎక్కడ పడితే అక్కడ చెత్త, నిర్మాణ వ్యర్థాలు వేయడాన్ని నివారించేందుకు ఈ-చలాన్లు జారీ చేస్తారు. చలాన్ల చెల్లింపులు యూపీఐ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. దీంతో లావాదేవీలు పారదర్శకంగా ఉంటాయి.
News March 29, 2025
బేగంపేట AIRPORT కింద సొరంగం.. గ్రీన్ సిగ్నల్ !

హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయం రన్‌వే కింద నుంచి 600 మీటర్ల పొడవు HMDA ఎలివేటెడ్ కారిడార్ అలైన్మెంట్ తీసుకెళ్తున్నట్లు HYD మెట్రో రైల్ సంస్థ తెలిపింది. ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి వరకు స్ట్రీప్ కర్వ్ ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. విమానాశ్రయం కింద సొరంగం నిర్మించేందుకు AAI తాజాగా అనుమతి లభించగా.. HMDA టెండర్లను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
News March 29, 2025
ఏషియన్ ఛాంపియన్‌షిప్స్: భారత్‌కు గోల్డ్

జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో జరుగుతున్న ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్-2025లో భారత్ తొలి గోల్డ్ మెడల్ సాధించింది. మహిళా రెజ్లర్ మనీషా భన్వాలా 62kgs విభాగంలో స్వర్ణ పతకం గెలిచారు. ఫైనల్‌లో ఉత్తర కొరియా ప్లేయర్ జె కిమ్‌పై 8-7 తేడాతో విజయం సాధించారు. మరో రెజ్లర్ అంతిమ్ పంఘల్ (53kgs) కాంస్యం గెలిచారు. దీంతో ఇప్పటివరకు భారత్ గెలిచిన మెడల్స్ సంఖ్య 7కు (1 గోల్డ్, 1 సిల్వర్, 5 బ్రాంజ్) చేరింది.