News March 29, 2025
ఏషియన్ ఛాంపియన్‌షిప్స్: భారత్‌కు గోల్డ్

జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో జరుగుతున్న ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్స్-2025లో భారత్ తొలి గోల్డ్ మెడల్ సాధించింది. మహిళా రెజ్లర్ మనీషా భన్వాలా 62kgs విభాగంలో స్వర్ణ పతకం గెలిచారు. ఫైనల్‌లో ఉత్తర కొరియా ప్లేయర్ జె కిమ్‌పై 8-7 తేడాతో విజయం సాధించారు. మరో రెజ్లర్ అంతిమ్ పంఘల్ (53kgs) కాంస్యం గెలిచారు. దీంతో ఇప్పటివరకు భారత్ గెలిచిన మెడల్స్ సంఖ్య 7కు (1 గోల్డ్, 1 సిల్వర్, 5 బ్రాంజ్) చేరింది.
Similar News
News July 8, 2025
అహ్మదాబాద్ విమాన ప్రమాద నివేదిక సమర్పణ

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి సంబంధించిన ప్రాథమిక నివేదికను ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB).. విమానయాన మంత్రిత్వ శాఖకు సమర్పించింది. బ్లాక్ బాక్స్ ఆధారంగా ప్రమాదానికి దారితీసిన కారణాలపై ఈ రిపోర్టును రూపొందించినట్లు సమాచారం. ఈ నివేదిక 4-5 పేజీలతో ఉండే అవకాశమున్నట్లు తెలుస్తోంది. కాగా గత నెలలో అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా ఫ్లైట్ కూలిపోయి 270 మంది మరణించిన విషయం తెలిసిందే.
News July 8, 2025
బిహార్ సీఎం నితీశ్ సంచలన ప్రకటన

ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బిహార్ సీఎం నితీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 35శాతం రిజర్వేషన్ ఇస్తామని ప్రకటించారు. దీంతో పాటు యువజన కమిషన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
News July 8, 2025
ఫిష్ వెంకట్‌కు హీరో విశ్వక్ సేన్ సాయం

కిడ్నీ సమస్యలతో తెలుగు నటుడు <<16976046>>ఫిష్ వెంకట్<<>> ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అతని ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోందనే సమాచారం తెలుసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మంచి మనసు చాటుకున్నారు. వైద్య అవసరాల కోసం రూ.2లక్షల చెక్కును వెంకట్ కుటుంబానికి అందించారు. అటు సినీ పెద్దలు కూడా ముందుకొచ్చి స్పందించాలని వెంకట్ కుటుంబం వేడుకుంటోంది.