News March 24, 2024
మీరు హోలీ ఆడుతున్నారా.. జాగ్రత్త..!

ప్రజలు రేపు హోలీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని MDK, SRD, సిద్దిపేట జిల్లాల పోలీసులు సూచిస్తున్నారు. రహదారులు, బహిరంగ ప్రదేశాల్లో గుర్తుతెలియని వ్యక్తులు, వాహనాలపై రంగులు చల్లకూడదని పేర్కొన్నారు. న్యూసెన్స్ చేస్తే సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే వైన్స్, బార్లు, పబ్లు, కల్లు కంపౌండ్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. >>>SHARE IT
Similar News
News January 12, 2026
మెదక్: ‘ఇంటిగ్రేటెడ్ స్కూల్ త్వరితగతిన పూర్తి చేయాలి’

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ విద్యాసంస్థల నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని మెదక్ కలెక్టర్‌ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదేశించారు. స్థల సేకరణ, నిర్మాణ పనులు, తదితర అంశాలపై సమీక్షించారు. అదనపు కలెక్టర్ నగేశ్, జిల్లా విద్యాధికారి విజయ, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
News January 12, 2026
మెదక్: ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: అదనపు కలెక్టర్

కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సమస్యల పరిష్కారానికి సమర్థంగా ఉపయోగించుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 44 అర్జీలను స్వీకరించారు. ఇందులో భూభారతి-32, పెన్షన్-2, ఇందిరమ్మ ఇళ్లు-2, ఇతర సమస్యలపై- 9 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. వచ్చిన అర్జీలను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
News January 12, 2026
వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి: కలెక్టర్

స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. సోమవారం పెద్ద శంకరంపేట రైతు వేదికలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొన్నారు. అనంతరం వివేకానంద జయంతి వేడుకల్లో భాగంగా చిత్రపటానికి నివాళులర్పించారు. యువత కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ రాణించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ సూచించారు.


