News March 21, 2025

అమెరికా విద్యాశాఖ మూసేస్తూ ట్రంప్ కీలక నిర్ణయం

image

అమెరికాలో విద్యాశాఖను మూసేస్తూ ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిననాటి నుంచి ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకోగా తాజాగా విద్యాశాఖపై బాంబ్ పేల్చారు. ఇందులో భాగంగానే ఇటీవల ఆ శాఖలోని ఉద్యోగాల్లో కోతలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా విద్యాశాఖను మూసేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు.

Similar News

News November 2, 2025

Viral: వజ్రనేత్రుడిని చూశారా?

image

బంగారు దంతాలను పెట్టుకునే వారిని చూసుంటారు.. ఈయన కాస్త వెరైటీ! వజ్రపు కన్ను పెట్టుకున్నారు. $2M విలువైన 2 క్యారెట్ల వజ్రాన్ని కృత్రిమ కనుగుడ్డుగా అమర్చుకున్నారు. US అలబామాకు చెందిన స్లేటర్ జోన్స్(23)కు 17 ఏళ్ల వయసులో Toxoplasmosis ఇన్ఫెక్షన్ వల్ల కుడి కన్నులో చూపు మందగించింది. సర్జరీలు చేయించుకున్నా మార్పు రాలేదు. దీంతో స్వయానా ఆభరణాల వ్యాపారైన ఆయన వజ్రంతో కనుగుడ్డును తయారు చేయించుకున్నారు.

News November 2, 2025

సినీ ముచ్చట్లు

image

✏ చిరంజీవి ‘మన శంకర్‌వరప్రసాద్‌గారు’ నుంచి సెకండ్ సింగిల్ ఈ నెలలోనే వచ్చే అవకాశం.. ఇప్పటికే చార్ట్ బస్టర్‌గా నిలిచిన ‘మీసాల పిల్ల’ సాంగ్
✏ ఈ నెల 6న రామ్ చరణ్ ‘పెద్ది’ నుంచి ఫస్ట్ సింగిల్ వచ్చే అవకాశం
✏ షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఆంధ్ర కింగ్ తాలుకా’.. ప్రమోషన్స్ మొదలు పెట్టనున్న టీమ్
✏ కిరణ్ అబ్బవరం ‘K-RAMP’ మూవీకి ప్రపంచవ్యాప్తంగా రూ.40 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు.. రేపు సక్సెస్ సెలబ్రేషన్స్

News November 2, 2025

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌కు విజయావకాశాలు: Lok Poll సర్వే

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకే విజయావకాశాలు ఉన్నాయని Lok Poll సర్వే తెలిపింది. 3,100 మందిపై సర్వే చేయగా 44% మంది కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నారని పేర్కొంది. బీఆర్ఎస్‌కు 38శాతం, బీజేపీ 15శాతం, ఇతరులు 3శాతం ప్రభావం చూపుతారని వెల్లడించింది. నిన్న విడుదలైన <<18171588>>కేకే సర్వేలో<<>> బీఆర్ఎస్‌కు గెలుపు అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఉపఎన్నిక ఈ నెల 11న జరగనుంది.