News March 21, 2025
అమెరికా విద్యాశాఖ మూసేస్తూ ట్రంప్ కీలక నిర్ణయం

అమెరికాలో విద్యాశాఖను మూసేస్తూ ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిననాటి నుంచి ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకోగా తాజాగా విద్యాశాఖపై బాంబ్ పేల్చారు. ఇందులో భాగంగానే ఇటీవల ఆ శాఖలోని ఉద్యోగాల్లో కోతలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా విద్యాశాఖను మూసేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ జారీ చేశారు.
Similar News
News April 24, 2025
హిమాచల్ ప్రదేశ్‌లో హైఅలర్ట్

పహల్‌గామ్ ఉగ్రదాడి తరహాలో మరోసారి తీవ్రవాదులు హిమాచల్‌ప్రదేశ్‌లో దాడులకు తెగబడే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ అధికారులు హెచ్చరించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉండాలని సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు పోలీస్ శాఖను ఆదేశించారు. ముఖ్యంగా జమ్మూకశ్మీర్‌తో బార్డర్‌ను పంచుకునే చంబా, కంగ్రా జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని సూచించారు.
News April 24, 2025
ఓటముల్లో SRH సెంచరీ

SRH ఓ చెత్త రికార్డును మూటగట్టుకుంది. IPL హిస్టరీలో 100 ఓటములను ఎదుర్కొన్న ఏడో టీమ్‌గా నిలిచింది. తొలి ఆరు స్థానాల్లో ఢిల్లీ(137), పంజాబ్(137), ఆర్సీబీ(132), KKR(125), ముంబై(121), రాజస్థాన్(113), CSK(105) ఉన్నాయి. SRHకు ముందు 2008-12 మధ్య హైదరాబాద్ వేదికగా ఉన్న డెక్కన్ ఛార్జర్స్ 75 మ్యాచ్‌లలో 46సార్లు ఓడిపోయింది.
News April 24, 2025
మే 20న అంగన్వాడీల సమ్మె

AP: వేతనాల పెంపుతో పాటు వేసవి సెలవులు, సెంటర్ల నిర్వహణకు ట్యాబ్‌లు ఇవ్వాలని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల యూనియన్ డిమాండ్ చేస్తోంది. ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే మే 20న రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేయనున్నట్లు ప్రకటించింది. లబ్ధిదారులకు అందించే సరుకులన్నీ విడతల వారీగా కాకుండా ఒకేసారి ఇవ్వాలని, ఫేస్ యాప్ ఇన్, ఔట్ లొకేషన్ తొలగించాలని వారు కోరుతున్నారు.