News March 21, 2025

కాళ్లు చచ్చుబడిన వ్యక్తికి AI సాయంతో తిరిగి నడక!

image

వెన్నెముక గాయంతో రెండేళ్లపాటు మంచం పట్టిన వ్యక్తిని చైనాలోని హువాషాన్ ఆస్పత్రి పరిశోధకులు తిరిగి నడిచేలా చేయగలిగారు. దీనికోసం వారు ఏఐని వాడుకోవడం విశేషం. ఏఐ సాయంతో తాము అభివృద్ధి చేసిన ‘ట్రిపుల్ ఇంటిగ్రేటెడ్ బ్రెయిన్ స్పైన్ ఇంటర్‌ఫేస్ టెక్నాలజీ’ని వాడి మెదడుకు, వెన్నెముకకు మధ్య ఎలక్ట్రోడ్‌లను అమర్చి నరాల బైపాస్ సర్జరీ నిర్వహించామన్నారు. 24 గంటలకే అతడికి కాళ్లు నియంత్రణలోకి వచ్చాయని వివరించారు.

Similar News

News March 23, 2025

రేపటి నుంచి డీఈఈ సెట్ దరఖాస్తులు

image

TG: రెండేళ్ల డీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే డీఈఈ సెట్‌కు ఈనెల 24 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇంటర్ పాసైన విద్యార్థులు మే 15 వరకు అప్లై చేసుకోవచ్చు. అదే నెల 25న ఆన్‌లైన్ పరీక్ష నిర్వహిస్తారు. సకాలంలో కౌన్సెలింగ్ పూర్తి చేసి, తరగతులు ప్రారంభించేందుకు గతంలో కంటే రెండు నెలల ముందుగానే విద్యాశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
వెబ్‌సైట్: <>deecet.cdse.telangana.gov.in<<>>

News March 23, 2025

మాజీ మంత్రి విడదల రజినీపై ఏసీబీ కేసు

image

AP: మాజీ మంత్రి విడదల రజినీతో సహా పలువురిపై ACB కేసు నమోదు చేసింది. YCP హయాంలో 2020 సెప్టెంబర్‌లో పల్నాడు (D) యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేశారనే అభియోగంపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆమెను అధికారులు ఏ1 నిందితురాలిగా చేర్చారు. అవినీతి నిరోధక చట్టంలోని 7, 7ఏ, ఐపీసీలోని 384, 120బి సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు.

News March 23, 2025

విడాకుల తర్వాత మద్యానికి బానిసయ్యా: ఆమిర్

image

మొదటి భార్య రీనా దత్తాతో విడాకుల తర్వాత తాను డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు ఆమిర్ ఖాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘మద్యం అలవాటు లేని నేను, రోజుకో బాటిల్ తాగేవాడిని. ఏడాదిన్నర పాటు సినిమాలకు దూరంగా ఉన్నా’ అని తెలిపారు. ఆమిర్, రీనా వివాహం 1986లో జరగగా, 2002లో విడిపోయారు. ఆ తర్వాత ఆమిర్ 2005లో కిరణ్ రావును పెళ్లాడి 2021లో విడాకులిచ్చారు. ఇప్పుడు గౌరీ స్ప్రాట్‌‌తో డేటింగ్‌లో ఉన్నారు.

error: Content is protected !!