News March 25, 2025
MLAలు పార్టీ మారి వార్షికోత్సవం పూర్తైంది: సుప్రీం

TG: పార్టీ మారిన MLAల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారించింది. ఈ సందర్భంగా ప్రతివాదులపై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘MLAలు పార్టీ మారి ఇప్పటికే వార్షికోత్సవం పూర్తైంది. రీజనబుల్ టైమ్ అంటే వారి పదవీకాలం పూర్తయ్యేవరకా? స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోకపోతే పదో షెడ్యూల్‌ను అపహాస్యం చేసినట్లే. ఆలస్యం చేసే ఎత్తుగడలు వేయొద్దు. దీనిపై వారంలోగా వివరణ ఇవ్వాలి’ అని ప్రభుత్వ తరఫు లాయర్‌ను ఆదేశించింది.
Similar News
News November 14, 2025
వణుకుతోన్న హైదరాబాద్.. సింగిల్ డిజిట్ నమోదు

చలికి హైదరాబాద్ మహానగరం గజగజ వణుకుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. నేడు అత్యల్పంగా శేరిలింగంపల్లిలో 8.8°C నమోదైంది. రాజేంద్రనగర్‌లో 10.7, BHELలో 11.1, బొల్లారం, మారేడుపల్లి, గచ్చిబౌలిలో 11.7, కుత్బుల్లాపూర్‌లో 12.2, జీడిమెట్లలో 12.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వచ్చే 3-4 రోజులూ ఇదే విధమైన వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది.
News November 14, 2025
జూబ్లీహిల్స్ కౌంటింగ్: షేక్‌పేట డివిజన్‌లో కాంగ్రెస్ లీడింగ్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో EVM ఓట్లను లెక్కిస్తున్నారు. తొలి రౌండ్‌లో కాంగ్రెస్ 47 ఓట్ల ఆధిక్యంలో ఉంది. షేక్‌పేట డివిజన్‌లో ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ లీడింగ్‌లో ఉన్నారు. కాంగ్రెస్‌కు 8,911, BRSకు 8,864 ఓట్లు పోలయ్యాయి. అటు పోస్టల్ బ్యాలెట్‌లోనూ కాంగ్రెస్‌కు ఆధిక్యం వచ్చింది. ఇక్కడ ముస్లిం ఓట్లు అధికంగా ఉండగా.. 11న పోలింగ్ రోజు సాయంత్రం BRS-కాంగ్రెస్ ఇక్కడ దొంగ ఓట్లపై ఆరోపణలు చేసుకున్నాయి.
News November 14, 2025
బిహార్‌లో 2 చోట్ల MIM ఆధిక్యం

దేశమంతా ఆసక్తిగా చూస్తున్న బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఎర్లీ ట్రెండ్స్ BJPకి అనుకూలంగా ఉన్నాయి. NDA 66 స్థానాల్లో లీడింగ్‌లో ఉండగా ఇందులో BJPవి 40, JDU 24 స్థానాలు. ఇక MGB 44 చోట్ల లీడ్ ప్రదర్శిస్తుండగా వీటిలో RJD-35, కాంగ్రెస్-7 ఉన్నాయి. ఇక ఏ కూటమిలో లేని AIMIM 2 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఆమౌర్‌లో 2020లో గెలిచిన ఆ పార్టీ అభ్యర్థి అక్తారుల్ ఇమాన్ ఈసారీ లీడ్‌లో ఉన్నారు.


