News March 25, 2025
సంచలన ఆరోపణలు: పోలీసుల కనుసన్నల్లో IPL బెట్టింగ్?

మహారాష్ట్ర ప్రతిపక్ష శివసేన(UBT) నేత అంబాదాస్ దాన్వే మండలిలో సంచలన ఆరోపణలు చేశారు. ముంబై పోలీసుల కనుసన్నల్లో భారీగా బెట్టింగ్ సాగుతోందన్నారు. తన వద్ద పెన్‌డ్రైవ్‌లో ఆధారాలున్నాయని, త్వరలోనే బయటపెడతానని చెప్పారు. ‘పోలీసు ఉన్నతాధికారులతో కలిసి కొంతమంది ఐపీఎల్ బెట్టింగ్‌లో పాల్గొంటున్నారు. పాకిస్థానీ క్రికెటర్లతో వీరంతా టచ్‌లో ఉన్నారు. ముంబై పోలీసులు ఈ ముఠాని కాపాడుతున్నారు’ అని పేర్కొన్నారు.
Similar News
News March 31, 2025
GOOD NEWS: తగ్గిన టోల్ ఛార్జీలు

హైదరాబాద్-విజయవాడ NHపై టోల్ ఛార్జీలు తగ్గాయి. ఈ అర్ధరాత్రి (ఏప్రిల్ 1) నుంచి తగ్గిన రుసుములు అమల్లోకి రానున్నాయి. ఈ హైవేపై 3 టోల్ ప్లాజాలు (పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు) ఉన్నాయి. పంతంగి వద్ద కార్లు, జీపులు, వ్యాన్లకు రూ.15, రెండువైపులా కలిపి రూ.30, బస్సు, ట్రక్కులకు రూ.50, రెండువైపులా కలిపి రూ.75 వరకు తగ్గించారు. చిల్లకల్లు వద్ద అన్ని వాహనాలకు ఒక వైపుకు రూ.5, ఇరువైపులా కలిపి రూ.10కి కుదించారు.
News March 31, 2025
IPL: సీఎస్కే చెత్త రికార్డు

ఐపీఎల్‌లో సీఎస్కే చెత్త రికార్డులు మూటగట్టుకుంటోంది. 2019 నుంచి ఆ జట్టు 180పైగా టార్గెట్‌ను ఛేదించలేదు. ఇప్పటివరకు 9సార్లు ఛేజింగ్‌కు దిగగా అన్నిట్లోనూ ఆ జట్టు ఓటమిపాలైంది. మరే ఇతర జట్టు ఛేజింగ్‌లో వరుసగా ఇన్ని మ్యాచులు ఓడిపోలేదు. ఐపీఎల్ చరిత్రలో ఓవరాల్‌గా సీఎస్కే 180పైగా ఛేజింగ్ కోసం 27 సార్లు బరిలోకి దిగి 15 సార్లు గెలిచింది. ఇందులో సురేశ్ రైనా ఆడిన 13 మ్యాచుల్లో విజయం సాధించింది.
News March 31, 2025
SRH.. బౌలింగ్‌లో రైజ్ అవ్వరా?

గత సీజన్లో భారీ స్కోర్లతో అలరించిన SRH ఈ సారి రెట్టించి ఆడుతుందని అభిమానులు అంచనాలు పెట్టుకున్నారు. తొలి మ్యాచులో అంచనాలను అందుకున్నా తర్వాతి రెండింట్లో విఫలమైంది. బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించినా బౌలింగ్‌లో సత్తా చాటలేకపోతుంది. చివరి 2 మ్యాచుల్లోనూ ప్రత్యర్థి 4-5 ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించడం ఆ బలహీనతను బయటపెడుతోంది. ఇలా అయితే 300 కొట్టినా లాభం లేదని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.