News March 25, 2025
సంచలన ఆరోపణలు: పోలీసుల కనుసన్నల్లో IPL బెట్టింగ్?

మహారాష్ట్ర ప్రతిపక్ష శివసేన(UBT) నేత అంబాదాస్ దాన్వే మండలిలో సంచలన ఆరోపణలు చేశారు. ముంబై పోలీసుల కనుసన్నల్లో భారీగా బెట్టింగ్ సాగుతోందన్నారు. తన వద్ద పెన్‌డ్రైవ్‌లో ఆధారాలున్నాయని, త్వరలోనే బయటపెడతానని చెప్పారు. ‘పోలీసు ఉన్నతాధికారులతో కలిసి కొంతమంది ఐపీఎల్ బెట్టింగ్‌లో పాల్గొంటున్నారు. పాకిస్థానీ క్రికెటర్లతో వీరంతా టచ్‌లో ఉన్నారు. ముంబై పోలీసులు ఈ ముఠాని కాపాడుతున్నారు’ అని పేర్కొన్నారు.
Similar News
News April 20, 2025
గుజరాత్‌లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ

AP: మంత్రి నారాయణ బృందం ఇవాళ అహ్మదాబాద్‌కు చేరుకుంది. అక్కడి నుంచి ఏక్తానగర్‌కు మంత్రి బస్సులో ప్రయాణించారు. ఏక్తానగర్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. విగ్రహ నిర్మాణానికి సంబంధించిన వివరాలు, ప్రత్యేకతలు అక్కడి అధికారుల్ని అడిగి తెలుసుకున్నారు. అమరావతిలో భారీ విగ్రహాల నిర్మాణం కోసం పటేల్ విగ్రహ నిర్మాణ తీరును మంత్రి బృందం అధ్యయనం చేయనున్నట్లు తెలుస్తోంది.
News April 20, 2025
విభేదాలు పరిష్కరించుకుంటే మంచిదే: దేవేంద్ర ఫడణవీస్

రాజ్ ఠాక్రేతో కలిసి పని చేసేందుకు సిద్ధమేనన్నఉద్ధవ్ ఠాక్రే వ్యాఖ్యలపై MH సీఎం దేవేంద్ర ఫడణవీస్ స్పందించారు. ‘ఇద్దరు కలిస్తే సంతోషమే, విభేదాలను పరిష్కరించుకోవడం మంచి విషయం’ అని సీఎం అన్నారు. కాగా MNSతో పొత్తులపై చర్చలు జరగలేదని శివసేన (UBT) ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. ఉద్ధవ్ ఠాక్రే, రాజ్ ఠాక్రేలు ఇద్దరూ సోదరులని రాజకీయంగా విభేదాలున్నప్పటికీ అన్నదమ్ముల బంధం తెగిపోదని అన్నారు.
News April 20, 2025
ఆసుపత్రిలో ప్రముఖ యాంకర్.. కారణమిదే

ప్రముఖ యాంకర్ రష్మీ గౌతమ్ ఆసుపత్రిలో చేరారు. ఇటీవల తనకు సర్జరీ జరిగిందనే విషయాన్ని తెలియజేస్తూ హాస్పిటల్‌లో ఉన్న ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. జనవరి నుంచి రక్తస్రావం, తీవ్రమైన భుజం నొప్పితో ఇబ్బందిపడినట్లు చెప్పారు. వర్క్ కమిట్మెంట్ పూర్తి చేసుకుని ఆసుపత్రిలో చేరితే ఏప్రిల్ 18న సర్జరీ జరిగిందన్నారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని, మరో 3 వారాలు విశ్రాంతి తీసుకోనున్నట్లు వెల్లడించారు.