News March 25, 2025
IPL.. వ్యూస్‌లో తగ్గేదే లే!

IPL మ్యాచ్‌లు భారీగా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఈ నెల 22న KKR, RCB జట్ల మధ్య మ్యాచ్‌తో సీజన్ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 4 మ్యాచులు అలరించాయి. కాగా, స్టార్‌స్పోర్ట్స్‌లో 25.3 కోట్లు, జియో హాట్‌స్టార్‌లో 137 కోట్ల వ్యూస్ వచ్చినట్లు క్రీడావర్గాలు తెలిపాయి. అలాగే 5K కోట్ల నిమిషాల వాచ్ టైం నమోదైనట్లు వెల్లడించాయి. ధనాధన్ ఆటతో అలరిస్తున్న IPL ఏటికేడు భారీ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంటోంది.
Similar News
News March 30, 2025
టాప్‌లో కొనసాగుతోన్న బెంగళూరు

ఐపీఎల్ 2025 ఆద్యంతం ఉత్కంఠగా కొనసాగుతోంది. ఈ సీజన్లో ఇప్పటివరకు రెండు జట్లు తప్ప అన్ని టీమ్‌లు రెండేసి మ్యాచులు ఆడాయి. RCB ఆడిన రెండింట్లోనూ నెగ్గి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత LSG, GT, PBKS, DC, SRH, KKR, CSK, MI, RR ఉన్నాయి. ముంబై, రాజస్థాన్ ఆడిన రెండింట్లోనూ ఓడి టేబుల్లో అట్టడుగున నిలిచాయి. ఇవాళ రెండు మ్యాచులు ఉండటంతో పట్టికలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి.
News March 30, 2025
భారీ ఎన్కౌంటర్: 20కు చేరిన మృతుల సంఖ్య

ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో శనివారం జరిగిన భారీ ఎన్కౌంటర్లో మృతుల సంఖ్య 20కు చేరుకుంది. ఈ కాల్పుల్లో మావోయిస్టు అగ్రనేత జగదీశ్ మృతి చెందినట్లు డిప్యూటీ సీఎం విజయ్ శర్మ వెల్లడించారు. గోగుండా కొండపై జరిగిన ఈ కాల్పుల్లో ఇద్దరు భద్రతా సిబ్బందికి కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. భద్రత బలగాలు ఇంకా కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
News March 30, 2025
బైక్ కొంటే రెండు హెల్మెట్లు ఇవ్వాల్సిందే: గడ్కరీ

దేశంలోని అన్ని టూవీలర్ వాహనాలను రెండు ఐఎస్ఐ గుర్తింపు ఉన్న హెల్మెట్లతో విక్రయించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశించారు. రహదారి భద్రతను పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ‘ప్రమాదాల్లో ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు ఈ ఆదేశం ఇలాంటి నష్టాలను నివారిస్తుంది. ఈ రూల్ రెగ్యులేషన్ మాత్రమే. ఇది జాతీయ అవసరం కూడా’ అని టీహెచ్ఎంఏ ఛైర్మన్ వ్యాఖ్యానించారు.