News March 25, 2025

IPL.. వ్యూస్‌లో తగ్గేదే లే!

image

IPL మ్యాచ్‌లు భారీగా ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. ఈ నెల 22న KKR, RCB జట్ల మధ్య మ్యాచ్‌తో సీజన్ ప్రారంభం కాగా, ఇప్పటి వరకు 4 మ్యాచులు అలరించాయి. కాగా, స్టార్‌స్పోర్ట్స్‌లో 25.3 కోట్లు, జియో హాట్‌స్టార్‌లో 137 కోట్ల వ్యూస్ వచ్చినట్లు క్రీడావర్గాలు తెలిపాయి. అలాగే 5K కోట్ల నిమిషాల వాచ్ టైం నమోదైనట్లు వెల్లడించాయి. ధనాధన్ ఆటతో అలరిస్తున్న IPL ఏటికేడు భారీ ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంటోంది.

Similar News

News April 19, 2025

ఈ ఏడాది చివర్లో ఇండియాకు వస్తా: మస్క్

image

ప్రధాని మోదీతో మాట్లాడటం గౌరవంగా ఉందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది చివర్లో భారత్‌లో పర్యటిస్తానని ఆయన రాసుకొచ్చారు. నిన్న ప్రధాని నరేంద్ర మోదీ చేసిన <<16137981>>ట్వీట్‌కు<<>> ఆయన రిప్లై ఇచ్చారు. కాగా, మస్క్‌కు చెందిన టెస్లా, స్టార్‌లింక్ కంపెనీలు త్వరలో ఇండియాలో తమ కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉంది.

News April 19, 2025

మరో గంటలో వర్షం

image

TG: పలు జిల్లాల్లో ఇవాళ కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. మహా నగరంలో నిన్నటి తరహాలోనే సాయంత్రం వాన పడొచ్చని అంచనా వేసింది. అలాగే మెదక్, మేడ్చల్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో మరో గంటలో వర్షం కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. ఉదయం నుంచి ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇది ఉపశమనం కలిగించే వార్తే అయినా అకాల వర్షాలతో జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి.

News April 19, 2025

చెరకు రసాన్ని నిల్వ ఉంచి తాగుతున్నారా?

image

వేసవిలో ఉపశమనం పొందేందుకు చాలా మంది చెరకు రసం తాగుతుంటారు. అయితే కొందరు చెరకు రసాన్ని నిల్వచేసి కొన్ని గంటల తర్వాత
సేవిస్తుంటారు. అలా చేయడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గది ఉష్ణోగ్రత వద్ద స్వచ్ఛమైన చెరకు రసం ఆక్సీకరణం చెందడం 15minలో మొదలవుతుంది. ఈ రసాయనిక చర్యతో 45 ని.ల్లోనే స్వచ్ఛత కోల్పోతుందని చెబుతున్నారు. ఆక్సీకరణం నెమ్మదించాలంటే చెరకు రసంలో కొంచెం నిమ్మరసం లేదా ఐస్‌ను వాడొచ్చు.

error: Content is protected !!