News March 26, 2025
నిర్మల్ ఎస్పీ క్యాంప్ ఆఫీస్‌లో నేడు ఇఫ్తార్ విందు

నిర్మల్ పోలీస్ మీ పోలీస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ముస్లిం పోలీసు సిబ్బందికి బుధవారం ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల తెలిపారు. జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సాయంత్రం 6 గంటలకు నిర్వహించే ఇఫ్తార్ విందులో ముస్లిం పోలీసులు పాల్గొనాలని కోరారు.
Similar News
News March 29, 2025
సెలవు రోజు కూడా బిల్లులు చెల్లించవచ్చు: ప్రకాశం SE

ప్రకాశం జిల్లాలోని అన్ని విద్యుత్ బిల్లులు కట్టే కేంద్రాలు 30,31వ తేదీల్లో పనిచేస్తాయని జిల్లా విద్యుత్ శాఖ ఎస్.ఈ కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. ఒంగోలులో శనివారం ఆయన మాట్లాడుతూ.. వినియోగదారుల సౌకర్యం కోసం సెలవు రోజుల్లో కూడా బిల్లు కట్టించుకుంటారని తెలిపారు. కాబట్టి వినియోగదారులు సకాలంలో బిల్లులు చెల్లించాలని కోరారు. నెలాఖరు అయినా తక్కువ చెల్లింపులు జరిగాయని అన్నారు.
News March 29, 2025
రాష్ట్రంలో 10,954 ప్రభుత్వ ఉద్యోగాలు.. కీలక ప్రకటన

TG: రాష్ట్రంలో 10,954 గ్రామ పాలన ఆఫీసర్ (GPO) పోస్టుల భర్తీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. గతంలో VRO, VRAలుగా పని చేసిన వారి నుంచి ఆప్షన్లు స్వీకరించనుంది. ఇందుకోసం డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. లేదంటే ఇంటర్ పూర్తి చేసి VRO/VRAగా కనీసం ఐదేళ్లు పని చేయాలి. వీరికి స్క్రీనింగ్ టెస్టు నిర్వహించి ఎంపిక చేస్తారు. విలేజ్ అకౌంట్స్ నిర్వహణ, సర్టిఫికెట్ల ఎంక్వైరీ లాంటి విధులు ఉంటాయి.
News March 29, 2025
‘ఆపరేషన్ బ్రహ్మ’.. మయన్మార్‌కు భారత్ సాయం

AP: వరుస భూకంపాలతో అల్లాడుతున్న మయన్మార్‌ను ఆదుకునేందుకు భారత్ ‘ఆపరేషన్ బ్రహ్మ’ ప్రారంభించింది. ఇందులో భాగంగా మయన్మార్‌లో ఏర్పాటు చేయనున్న తాత్కాలిక ఆస్పత్రి కోసం 118 మంది సిబ్బంది వెళ్తారని కేంద్రం వెల్లడించింది. అక్కడ భూకంపాల ఘటనల్లో భారతీయులెవరూ మృతి చెందలేదని తెలిపింది. సహాయక సామగ్రి చేరవేతకు భారత నౌకాదళం చర్యలు చేపట్టగా, ఇప్పటికే INS సావిత్రి, INS సాత్పుర బయల్దేరాయని చెప్పింది.