News March 29, 2025
‘ఆపరేషన్ బ్రహ్మ’.. మయన్మార్‌కు భారత్ సాయం

AP: వరుస భూకంపాలతో అల్లాడుతున్న మయన్మార్‌ను ఆదుకునేందుకు భారత్ ‘ఆపరేషన్ బ్రహ్మ’ ప్రారంభించింది. ఇందులో భాగంగా మయన్మార్‌లో ఏర్పాటు చేయనున్న తాత్కాలిక ఆస్పత్రి కోసం 118 మంది సిబ్బంది వెళ్తారని కేంద్రం వెల్లడించింది. అక్కడ భూకంపాల ఘటనల్లో భారతీయులెవరూ మృతి చెందలేదని తెలిపింది. సహాయక సామగ్రి చేరవేతకు భారత నౌకాదళం చర్యలు చేపట్టగా, ఇప్పటికే INS సావిత్రి, INS సాత్పుర బయల్దేరాయని చెప్పింది.
Similar News
News April 24, 2025
వెంకటేశ్‌తో కలిసి సినిమా.. నాని ఏమన్నారంటే?

శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో ‘ప్యారడైజ్’ మూవీ షూటింగ్ మే 2న ప్రారంభమవుతుందని హీరో నాని తెలిపారు. ఆ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న విడుదలవుతుందని చెప్పారు. ఆ తర్వాత సుజీత్‌తో చిత్రం ఉంటుందన్నారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘వెంకటేశ్, నేను హీరోలుగా త్రివిక్రమ్ ఓ సినిమా చేయాలనుకున్నారు. అలాగే శేఖర్ కమ్ములతోనూ చర్చలు జరిగాయి. అయితే ఆ ప్రాజెక్టులు పట్టాలెక్కలేదు’ అని పేర్కొన్నారు.
News April 24, 2025
ఏప్రిల్ 24: చరిత్రలో ఈరోజు

✒ 1929: ప్రముఖ నటుడు రాజ్‌కుమార్ జననం
✒ 1934: నిర్మాత ఏడిద నాగేశ్వరరావు జననం
✒ 1969: జ్యోతిష పండితుడు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి జననం
✒ 1973: మాజీ క్రికెటర్ సచిన్ జననం
✒ 1993: 73వ రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ వ్యవస్థ అమలులోకి వచ్చింది
✒ 2011: ఆధ్యాత్మిక గురువు సత్యసాయి బాబా మరణం
News April 24, 2025
పాక్‌పై సానుభూతి చూపేదిలేదు: కిషన్‌రెడ్డి

దేశ ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉగ్రదాడి వెనకున్న పాక్‌తో సింధూ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం మంచి పరిణామమన్నారు. ఆ దేశంపై సానుభూతి చూపే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు దౌత్యపరమైన సమాధానమే ఇచ్చామని, త్వరలో మిలటరీ పరంగానూ ఆన్సర్ ఉంటుందని తెలిపారు. ఉగ్రదాడిలో పోయిన ప్రతి ప్రాణానికి ప్రతీకారం తప్పదనే సంకేతాలు కేంద్రం ఇచ్చిందన్నారు.