News March 26, 2025
MBNR: DEECET-2025 నోటిఫికేషన్ విడుదల

ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ప్రవేశ పరీక్ష రాయడానికి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంలో అర్హత కలిగిన అభ్యర్థులు DEECET-2025 నోటిఫికేషన్ విడుదల చేశామని డైట్ ప్రిన్సిపల్ మేరాజుల్లాఖాన్ ఓ ప్రకటన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తేదీ 01-09-2024 నాటికి 17 సంవత్సరాలు వయసు కలిగి ఉండాలని, https://deecet.cdse.telangana.gov.in ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలన్నారు.
Similar News
News March 31, 2025
ఉప్పల్: ‘అద్భుతంగా మెట్రో ఆర్ట్ ఫెస్ట్’

HYD మెట్రో ఆధ్వర్యంలో నిర్వహించిన ఆర్ట్ ఫెస్ట్ అద్భుతంగా ముగిసిందని మెట్రో సంస్థ తెలిపింది. గ్రీన్ లైన్, రెడ్ లైన్, బ్లూ లైన్ ప్రయాణికులు పాల్గొని, తమ ఊహలను చిత్రాలుగా మలిచి అద్భుతమైన ప్రదర్శన కనబరిచినట్లుగా పేర్కొంది. ఆర్టిస్టుల ప్రదర్శన చిత్రాలను ప్రత్యేక గాలరీలో భద్రపరుస్తామని HYD నాగోల్, అమీర్పేట మెట్రో అధికారులు తెలిపారు.
News March 31, 2025
మహబూబ్‌నగర్: రంజాన్ పండుగ భద్రతను పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ

రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ డి.జానకి ఈద్గాను సందర్శించారు. ఈ సందర్భంగా ఈద్గా వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి పోలీస్ సిబ్బందితో మాట్లాడారు. శాంతిభద్రతలు, ప్రజల సౌకర్యం, శాంతియుతం,ట్రాఫిక్ నిర్వహణ, ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని సీసీ కెమెరాల పర్యవేక్షణ, అత్యవసర సేవల ఏర్పాట్లు ఈద్గా, మసీదులు ప్రధాన కూడళ్ల వద్ద అదనపు బందోబస్తు అంశాలపై అధికారులతో సమీక్షించారు.
News March 31, 2025
తెలంగాణ టు ఫిలిప్పీన్స్.. వయా కాకినాడ

ఏపీలోని కాకినాడ పోర్టు నుంచి తెలంగాణ ప్రభుత్వం ఫిలిప్పీన్స్‌కు బియ్యాన్ని ఎగుమతి చేయనుంది. 8 లక్షల టన్నుల బియ్యం ఎక్స్‌పోర్ట్‌కు ఒప్పందం కుదరగా తొలి విడతగా ఇవాళ 12,500 టన్నుల MTU 1010 రకాన్ని పంపనుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ కాకినాడ వెళ్లి బియ్యం నౌకను జెండా ఊపి ప్రారంభించారు. ఆయన వెంటన ఫిలిప్పీన్స్ ప్రతినిధులు, రాష్ట్ర ఉన్నతాధికారులు ఉన్నారు.