News March 31, 2025
తెలంగాణ టు ఫిలిప్పీన్స్.. వయా కాకినాడ

ఏపీలోని కాకినాడ పోర్టు నుంచి తెలంగాణ ప్రభుత్వం ఫిలిప్పీన్స్‌కు బియ్యాన్ని ఎగుమతి చేయనుంది. 8 లక్షల టన్నుల బియ్యం ఎక్స్‌పోర్ట్‌కు ఒప్పందం కుదరగా తొలి విడతగా ఇవాళ 12,500 టన్నుల MTU 1010 రకాన్ని పంపనుంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇవాళ కాకినాడ వెళ్లి బియ్యం నౌకను జెండా ఊపి ప్రారంభించారు. ఆయన వెంటన ఫిలిప్పీన్స్ ప్రతినిధులు, రాష్ట్ర ఉన్నతాధికారులు ఉన్నారు.
Similar News
News April 18, 2025
చైనా నన్ను కలవాలనుకుంటోంది: ట్రంప్

చైనా దిగుమతులపై US 245% టారిఫ్ విధించిన నేపథ్యంలో ఇరుదేశాల మధ్య వాణిజ్య వివాదం ముదిరింది. US ఇలాగే టారిఫ్‌ల ఆట కొనసాగిస్తే దాన్ని పట్టించుకోబోమని చైనా ఇటీవల పేర్కొంది. ఈ నేపథ్యంలో చైనా తనను కలవాలని అనుకుంటోదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇటీవల మెక్సికో, జపాన్ వాణిజ్య ప్రతినిధులతో ప్రయోజనకర సంభాషణ జరిగిందని, ఇలాగే ఆ దేశమూ చర్చలు కోరుకుంటున్నట్లు చెప్పారు. అయితే, చైనా దీనిపై స్పందించాల్సి ఉంది.
News April 18, 2025
రూ.10 నాణెం తయారీకి ఎంత ఖర్చవుతుందంటే?

రెండు రంగులతో కనిపించే రూ.10 నాణేన్ని తయారు చేయడానికి ఆర్బీఐ రూ.5.54 ఖర్చు చేస్తుంది. కాయిన్ మధ్య భాగాన్ని కుప్రో నికెల్‌తో, బయటి సర్కిల్‌ను అల్యూమినియం కాంస్యంతో తయారు చేస్తారు. అలాగే, నాణెం బయటి వృత్తం 4.45 గ్రాములు, మధ్య భాగం 3.26 గ్రాములతో మొత్తం 7.71గ్రా. బరువు ఉంటుంది. గతంలో కొన్ని రోజులు ఈ నాణేలు చెల్లవని ప్రచారం జరిగినా, అవి చట్టబద్ధమైనవని ఆర్బీఐ అవగాహన కల్పించిన విషయం తెలిసిందే.
News April 18, 2025
తరచూ జలుబు వేధిస్తోందా?

సీజన్లతో సంబంధం లేకుండా కొందరిని తరచూ జలుబు వేధిస్తుంటుంది. దీనికి శరీరంలో అయోడిన్ లోపం కారణమై ఉండొచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. మరికొందరిలో మాటిమాటికీ వచ్చే ఆవలింతలకు కారణం ఐరన్ లోపం అని అంటున్నారు. అలాగే, కాళ్లు, చేతుల కండరాల్లో రెగ్యులర్‌గా నొప్పులు వస్తుంటే శరీరంలో మెగ్నీషియం తక్కువైందని గుర్తించాలంటున్నారు. వెన్ను, కాళ్ల నొప్పులొస్తే విటమిన్-D టెస్ట్ చేయించుకోవాలని సూచిస్తున్నారు.