News March 25, 2024
ముఖ్య నేతలతో పురందీశ్వరి సమీక్ష

AP: విజయవాడలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ముఖ్య నేతలతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందీశ్వరి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచార షెడ్యూల్‌పై నాయకులతో చర్చిస్తున్నారు. ఏప్రిల్ 5 నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహించనుండగా.. బహిరంగ సభలకు కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు రానున్నారు. ఇటు ఒకట్రెండు రోజుల్లో ఎన్నికల్లో పోటీ చేసే అసెంబ్లీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నారు.
Similar News
News March 12, 2026
ఫోన్ పే, గూగుల్ పేలో కరెంట్ బిల్ కట్టలేకపోతున్నారా?

ఆన్‌లైన్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్స్ ఫోన్ పే, గూగుల్ పే, అమెజాన్ పే వంటి వాటిలో కరెంట్ బిల్లుల చెల్లింపు ఆప్షన్ పనిచేయడం లేదని యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. గతంలో లాగా బిల్ జనరేట్ అవ్వడం లేదని, తాత్కాలికంగా బిల్లర్ డౌన్ అంటూ చూపుతోందని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మీకూ ఈ సమస్య ఎదురవుతోందా? అయితే విద్యుత్ శాఖ అఫీషియల్ యాప్‌లో పవర్ బిల్ పే చేయొచ్చు.
News March 12, 2026
సిలిండర్లు నిల్వ ఉంచుకోవద్దు.. కేంద్రం సూచన

దేశంలో గ్యాస్ సరఫరాపై ప్రజలు ఆందోళన చెందొద్దని కేంద్ర పెట్రోలియం, నేచురల్ గ్యాస్ శాఖ వెల్లడించింది. LPG ఉత్పత్తి పెంపు, సరఫరాలో ఇళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొంది. 2.5 రోజుల్లోనే సిలిండర్లు డెలివరీ చేస్తున్నామని తెలిపింది. ప్రజలు ఆందోళన చెంది హడావుడిగా బుకింగ్స్ చేయడం లేదా సిలిండర్లు నిల్వ ఉంచుకోవాల్సిన అవసరంలేదని స్పష్టం చేసింది. అవసరమైన సమయంలో ఆన్‌లైన్‌లో బుకింగ్ చేసుకోవచ్చని తెలిపింది.
News March 12, 2026
చిప్ తయారీ కోసం కేంద్రం ₹లక్ష కోట్ల ఫండ్?

ఎలక్ట్రానిక్ డివైజ్‌లలో వాడే చిప్‌ల తయారీని ప్రోత్సహించేందుకు ₹లక్ష కోట్లను కేటాయించాలని కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ ఫండ్‌తో చిప్ డిజైన్ ప్రాజెక్టులు, తయారీ పరికరాలు, సరఫరా వ్యవస్థ అభివృద్ధికి సబ్సిడీలను కల్పించనుంది. చిప్ తయారీ కోసం ₹4లక్షల కోట్లను కేటాయించిన US తరహాలోనే ఈ పాలసీతో గ్లోబల్ కంపెనీలను ఆకర్షించాలని కేంద్రం భావిస్తోంది. మరో 2 లేదా 3 నెలల్లో ఇది లాంచ్ కావొచ్చని సమాచారం.


