News March 26, 2025

9,970 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(RRB) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 9,970 ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 10 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. దరఖాస్తు ఫీజు జనరల్/OBCలకు రూ.500, మిగతావారికి రూ.250గా ఉంది. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉన్నవారిని అర్హులుగా పేర్కొంది. సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. అప్లికేషన్లకు చివరి తేదీ మే 9.
www.indianrailways.gov.in

Similar News

News December 29, 2025

వాళ్లు కన్నడ చిత్రాల్లో నటించట్లేదు: సుదీప్

image

మిగతా ఇండస్ట్రీల నుంచి కన్నడ సినిమాలకు పెద్దగా సపోర్ట్ దొరకట్లేదని హీరో కిచ్చా సుదీప్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘నేను, శివరాజ్ కుమార్, ఉపేంద్ర పలు భాషల్లో అతిథి పాత్రలు చేశాం. నేను కొన్నిసార్లు డబ్బులే తీసుకోలేదు. కానీ ఆయా భాషల నటులు కన్నడ చిత్రాల్లో యాక్ట్ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు. నేను వ్యక్తిగతంగా కొందరు యాక్టర్స్‌ను అడిగినా నటించలేదు’ అని ‘మార్క్’ సినిమా ప్రమోషన్లలో ఆయన వాపోయారు.

News December 29, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (డిసెంబర్ 29, సోమవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5:28 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.45 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.18 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 4.15 గంటలకు ♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.51 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7:09 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News December 29, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.