News March 26, 2025
9,970 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(RRB) నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 9,970 ఉద్యోగాల భర్తీకి ఏప్రిల్ 10 నుంచి దరఖాస్తులు స్వీకరించనుంది. దరఖాస్తు ఫీజు జనరల్/OBCలకు రూ.500, మిగతావారికి రూ.250గా ఉంది. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉన్నవారిని అర్హులుగా పేర్కొంది. సీబీటీ విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. అప్లికేషన్లకు చివరి తేదీ మే 9.
www.indianrailways.gov.in
Similar News
News April 20, 2025
‘గ్లోబల్ మీడియా డైలాగ్’కు మోదీ సారథ్యం

ముంబైలో మే 1-4 వరకు జరగనున్న వరల్డ్ ఆడియో విజువల్, ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్(WAVES)లో ‘గ్లోబల్ మీడియా డైలాగ్’ అంశానికి PM మోదీ సారథ్యం వహించనున్నారు. వివిధ దేశాల్లోని మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్(M&E) రంగాల క్రియేటర్స్‌ను కనెక్ట్ చేసే వేదికే WAVES. సమ్మిట్‌లో పలు అంశాలపై సెషన్స్ జరగనున్నాయి. ఈ సందర్భంగా ‘క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ ది వరల్డ్’ నినాదంతో M&E హబ్‌కు మోదీ శంకుస్థాపన చేయనున్నారు.
News April 20, 2025
BRS ఓటమి తెలంగాణకే నష్టం: కేటీఆర్

TG: ఎన్నికల్లో ఓడిన తర్వాత బీఆర్ఎస్ కంటే రాష్ట్రానికే ఎక్కువ నష్టం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మళ్లీ కేసీఆర్‌ను సీఎం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ‘కాంగ్రెస్ సర్కార్ 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామంది. కానీ 500 రోజులైనా ఒక్క పథకం కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది’ అని ఆయన ఫైర్ అయ్యారు.
News April 20, 2025
IPL: CSKలో మార్పులు?

ఇవాళ ముంబై ఇండియన్స్‌తో జరగబోయే మ్యాచులో సీఎస్కే మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. వరుసగా మ్యాచులు ఓడిపోతున్న నేపథ్యంలో యాజమాన్యం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. త్రిపాఠి లేదా విజయ్ శంకర్ స్థానంలో శివమ్ దూబే, పతిరణ స్థానంలో డెవాల్డ్ బ్రెవిస్‌ను తుది జట్టులోకి తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. పతిరణను ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దించుతారని టాక్.