News March 27, 2025
ఏపీ, టీజీలో అసెంబ్లీ సీట్లు పెంచలేదు: రేవంత్

TG: ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచాలని చట్టంలో ఉందని, కానీ పెంచలేదని సీఎం రేవంత్ అన్నారు. రాజకీయ ప్రయోజనాలు లేకపోవడంతోనే పెంచలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ పాటించలేదు. దీంతో దక్షిణాది నుంచి లోక్‌సభలో 24 శాతం జనాభాకు మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అందరూ ఉమ్మడి పోరాటం చేయాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News November 4, 2025
మెడికల్ ఎగ్జామినేషన్‌లో ప్రైవసీ

BNS సెక్షన్ 53(2) ప్రకారం, క్రిమినల్ కేసుల వైద్యపరీక్షల సమయంలో ఒక మహిళను వైద్యురాలు లేదా ఆమె పర్యవేక్షణలో మాత్రమే పరీక్షించాలి. సెన్సిటివ్ మెడికల్ ప్రొసీజర్స్‌లో మహిళల కంఫర్ట్, కన్సెంట్, డిగ్నిటీ కాపాడేందుకు ఈ హక్కు కల్పించారు. అలాగే సెక్షన్ 179 ప్రకారం మహిళలను విచారణ కోసం పోలీస్‌స్టేషన్‌కు పిలవకూడదు. పోలీసులే ఆమె ఇంటికి వెళ్లాలి. ఆ సమయంలో ఒక మహిళా పోలీసు అధికారి తప్పనిసరిగా ఉండాలి.
News November 4, 2025
ఆ ఊర్లో అడుగడుగునా హనుమాన్ ఆలయాలే..

TG: జగిత్యాల(D) వెల్లుల్ల అనే గ్రామంలో ఏ మూల చూసినా, ఏ వాడ తిరిగినా ఆంజనేయుడి గుళ్లే దర్శనమిస్తాయి. 2,500 కన్నా తక్కువ జనాభా ఉన్న ఈ ఊర్లో దాదాపు 45 హనుమాన్ ఆలయాలున్నాయి. పూర్వం ఇక్కడ నివాసమున్న బ్రాహ్మణ కుటుంబాలు తమ వంశాల వారీగా ఎవరికి వారు ఈ ఆలయాలను నిర్మించుకున్నారట. ఈ అన్ని ఆలయాల్లోనూ క్రమం తప్పకుండా పూజలు నిర్వహించడం విశేషం. ☞ ఇలాంటి ఆసక్తికర ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.
News November 4, 2025
వరికి మానిపండు తెగులు ముప్పు.. ఎలా నివారించాలి?

ఇటీవల భారీ వర్షాలకు మానిపండు తెగులు వరి పంటను ఆశించి నష్టపరిచే అవకాశం ఉంది. ఈ తెగులును కలగజేసే శిలీంధ్రం వరి వెన్నులోని గింజల్లోకి ప్రవేశించి గింజలపై పసుపు రంగులో గుండ్రని ముద్ద లేత పువ్వులాగ మారుతుంది. క్రమేపీ ఇది నలుపు పొడిగా మారి వెన్నులో గింజలను నల్లగా మారుస్తుంది. మానిపండు తెగులు నివారణకు 200 లీటర్ల నీటిలో ఎకరాకు ప్రాపికొనజోల్ 200ml లేదా క్లోరోథలోనిల్ 400 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి.


