News March 27, 2025
ఏపీ, టీజీలో అసెంబ్లీ సీట్లు పెంచలేదు: రేవంత్

TG: ఏపీ, తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెంచాలని చట్టంలో ఉందని, కానీ పెంచలేదని సీఎం రేవంత్ అన్నారు. రాజకీయ ప్రయోజనాలు లేకపోవడంతోనే పెంచలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఉత్తరాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ పాటించలేదు. దీంతో దక్షిణాది నుంచి లోక్‌సభలో 24 శాతం జనాభాకు మాత్రమే ప్రాతినిధ్యం ఉంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా అందరూ ఉమ్మడి పోరాటం చేయాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News April 24, 2025
అమరావతిలో ప్రధాని షెడ్యూల్ ఇదే

AP: ప్రధాని మోదీ మే 2వ తేదీన అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆరోజు మ.3 గంటలకు ఆయన గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. మ.3.30 గంటలకు అమరావతికి వచ్చి 1.1 కి.మీ మేర 15 నిమిషాలపాటు రోడ్ షో నిర్వహిస్తారు. తర్వాత అమరావతి పెవిలియన్‌ను సందర్శిస్తారు. సా.4 నుంచి 5 వరకు సభలో పాల్గొని తిరుగు ప్రయాణమవుతారు.
News April 24, 2025
స్విట్జర్లాండ్ వీసా రిజెక్ట్.. మినీ స్విట్జర్లాండ్‌లో ఉగ్రతూటాకు బలి

ఉగ్రదాడిలో చనిపోయిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ ఉదంతంలో మరో హృదయవిదారక అంశం వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 16న వివాహం చేసుకున్న అతను హనీమూన్ కోసం స్విట్జర్లాండ్ వెళ్లాలనుకున్నారు. వీసా రిజెక్ట్ కావడంతో మినీ స్విట్జర్లాండ్‌గా భావించే పహల్‌గామ్ వెళ్లి ఉగ్రతూటాకు బలయ్యారు. అతడికి చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలని ఉండేదని, అందుకే నేవీలో చేరాడని పేరెంట్స్ చెప్పారు.
News April 24, 2025
ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత సీట్లు.. 28 నుంచి దరఖాస్తులు

AP: అన్ని ప్రైవేట్ స్కూళ్లలో పేదల పిల్లలకు 2025-26 విద్యాసంవత్సరంలో 25% ఉచిత ప్రవేశాలకు షెడ్యూల్ వెలువడింది. ఫస్ట్ క్లాస్‌లో సీట్ల కోసం ఈ నెల 28 నుంచి మే 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. చిరునామా ధ్రువీకరణకు పేరెంట్స్ ఆధార్ కార్డ్/ ఓటరు కార్డు/ రేషన్ కార్డు/డ్రైవింగ్ లైసెన్స్/ విద్యుత్ బిల్లు అవసరం. విద్యార్థుల వయసు 01.06.2025 నాటికి ఐదేళ్లు నిండి ఉండాలి.
వెబ్‌సైట్: https://cse.ap.gov.in/