News March 27, 2025
ప్రభుత్వ ఆఫీసుల్లో AI వినియోగంపై నిషేధం లేదు: కేంద్రమంత్రి

ప్రభుత్వ కార్యాలయాల్లో AI వినియోగంపై ప్రత్యేకంగా ఎలాంటి నిషేధం లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. డిజిటల్ సాంకేతికతను వాడుతున్న సమయంలో ప్రజా సమాచార భద్రత, గోప్యత విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని రాజ్యసభలో చెప్పారు. ప్రభుత్వ అధికారులు ఏదైనా అప్లికేషన్, వెబ్సైట్, సాంకేతికతను ఉపయోగించిన విషయంలో సైబర్ సెక్యూరిటీ గైడ్‌లైన్స్‌కు లోబడి వ్యవహరించాలని కేంద్రం పేర్కొంది.
Similar News
News April 1, 2025
విజయ్ చివరి సినిమా OTT రైట్స్‌కు ₹121కోట్లు!

తమిళ స్టార్ నటుడు దళపతి విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా ఓటీటీ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తాన్ని చెల్లించినట్లు సినీవర్గాలు తెలిపాయి. దీనికోసం ఏకంగా రూ.121 కోట్లు చెల్లించి ‘జన నాయగన్’ పాన్ ఇండియా ఓటీటీ హక్కులు పొందినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని హెచ్.వినోద్ తెరకెక్కిస్తున్నారు.
News April 1, 2025
IPL: టాస్ గెలిచిన పంజాబ్

లక్నోలో జరుగుతున్న LSGvsPBKS మ్యాచ్‌లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
జట్లు ఇవే:
PBKS: ప్రభ్‌సిమ్రన్, ప్రియాన్ష్, శశాంక్, శ్రేయస్, స్టొయినిస్, మ్యాక్స్‌వెల్, సూర్యాన్ష్, జాన్సెన్, చాహల్, ఫెర్గుసన్, అర్షదీప్
LSG: మార్ష్, మార్క్రమ్, పూరన్, పంత్, బదోనీ, మిల్లర్, సమద్, దిగ్వేశ్, శార్దూల్, బిష్ణోయ్, ఆవేశ్
News April 1, 2025
CBN, లోకేశ్, పవన్‌పై వైసీపీ ‘ఏప్రిల్ ఫూల్’ ట్వీట్

AP: ఏప్రిల్ ఫస్ట్ సందర్భంగా చంద్రబాబుకు డబ్బు కట్ట, లోకేశ్‌కు పాల డబ్బా, పవన్‌కు రిమోట్‌ను సింబల్స్‌గా పెట్టి వైసీపీ సెటైరికల్ ట్వీట్ చేసింది. ‘వెరీ ఫేమస్ పాత్రలు.. స్కామర్ బాబు, పప్పు లోకేశ్, పవన్ కంట్రోల్. ఇప్పుడు మీ సమీపంలోని హెరిటేజ్ స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి. ఏప్రిల్ ఫూల్ కోడ్‌ను ఉపయోగించి 50 శాతం డిస్కౌంట్ పొందండి. లేదా TDPFools కోడ్‌తో 100% తగ్గింపును పొందండి’ అని రాసుకొచ్చింది.