News March 27, 2025

ప్రభుత్వ ఆఫీసుల్లో AI వినియోగంపై నిషేధం లేదు: కేంద్రమంత్రి

image

ప్రభుత్వ కార్యాలయాల్లో AI వినియోగంపై ప్రత్యేకంగా ఎలాంటి నిషేధం లేదని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. డిజిటల్ సాంకేతికతను వాడుతున్న సమయంలో ప్రజా సమాచార భద్రత, గోప్యత విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని రాజ్యసభలో చెప్పారు. ప్రభుత్వ అధికారులు ఏదైనా అప్లికేషన్, వెబ్‌సైట్, సాంకేతికతను ఉపయోగించిన విషయంలో సైబర్ సెక్యూరిటీ గైడ్‌లైన్స్‌కు లోబడి వ్యవహరించాలని కేంద్రం పేర్కొంది.

Similar News

News April 19, 2025

నేటి నుంచి GMAT స్పెషల్ క్లాసులు

image

TG: గ్రాడ్యుయేట్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్(GMAT) వచ్చే నెలలో జరగనుంది. పరీక్ష రాసే అభ్యర్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు నేటి నుంచి స్పెషల్ క్లాసులు నిర్వహించనున్నట్లు టీశాట్ CEO వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. రోజూ ఉ.8-8.30 వరకు నిపుణ ఛానల్‌లో, సాయంత్రం 6-6.30 వరకు విద్య ఛానల్లో క్లాసులు ప్రసారం చేస్తామని వెల్లడించారు. APRIL 22న ‘వరల్డ్ ఎర్త్ డే’ సందర్భంగా ఉ.11కు ప్రత్యేక లైవ్ పోగ్రామ్ ఉంటుందన్నారు.

News April 19, 2025

నేడు ఐపీఎల్‌లో డబుల్ ధమాకా

image

IPLలో ఇవాళ 2 మ్యాచ్‌లు జరగనున్నాయి. మ.3.30కు అహ్మదాబాద్ వేదికగా టైటాన్స్‌తో ఢిల్లీ తలపడనుంది. ఇప్పటి వరకూ ఈ రెండింటి మధ్య 5 మ్యాచులు జరగ్గా DC 3, GT 2 సార్లు గెలిచాయి. అలాగే, రాత్రి 7.30కు జైపూర్‌లో రాజస్థాన్, లక్నో బరిలోకి దిగనున్నాయి. ఈ టీమ్స్ గతంలో ఐదుసార్లు తలపడితే రాజస్థాన్‌(4)దే పైచేయిగా నిలిచింది. పక్కటెముకల గాయంతో బాధపడుతున్న RR కెప్టెన్ శాంసన్ ఈ మ్యాచ్ ఆడటంపై సందిగ్ధం నెలకొంది.

News April 19, 2025

మే 2న కేదార్‌నాథ్, 4న బద్రీనాథ్ ఆలయాలు ఓపెన్

image

చార్‌ధామ్ యాత్రలో ముఖ్యమైన కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రాన్ని మే 2న తెరవనున్నట్లు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ అధికార ప్రతినిధి తెలిపారు. అలాగే, మే 4న బద్రీనాథ్ ఆలయాన్ని ఓపెన్ చేస్తామన్నారు. వీటితో పాటు రెండో కేదార్‌గా పిలవబడే మద్‌మహేశ్వర ఆలయాన్ని మే 21న, మూడో కేదార్ తుంగ గుడిని మే 2న తెరుస్తామని వివరించారు. విపరీతమైన మంచు వల్ల వేసవిలో కొన్ని రోజుల పాటే ఈ ఆలయాలు తెరిచి ఉంటాయి.

error: Content is protected !!