News March 25, 2024
సజ్జలపై ఈసీకి అచ్చెన్నాయుడు ఫిర్యాదు

AP: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ నేతలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కోడ్ ఉల్లంఘిస్తూ ప్రెస్‌మీట్‌లు పెట్టి ప్రతిపక్షాలపై ఆరోపణలు చేశారని దుయ్యబట్టారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన సజ్జలను పదవి నుంచి తొలగించాలని ఈసీని కోరారు.
Similar News
News March 14, 2026
కోడి పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఎండలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో కోడి పిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఇవి వేడి ఒత్తిడికి గురైతే నీరసంగా మారతాయి. విరేచనాలు అయ్యి నిలబడలేక వణుకుతుంటాయి. అలాగే అవి మెడలు వాల్చి సన్నగా మూలుగుతూ ఉన్నా, వాటి కంటి నుంచి నీరు కారుతున్నట్లు గుర్తించినా నిర్లక్ష్యం చేయవద్దు. ఈ లక్షణాలున్న కోడి పిల్లలను, కోళ్లను షెడ్డులోని మిగిలిన వాటి నుంచి వేరు చేసి వెటర్నరీ నిపుణులకు చూపించాలి.
News March 14, 2026
‘సంభల్’లో నమాజ్.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

<<15204583>>వివాదాస్పద సంభల్<<>>లోని మసీదులో నమాజ్ చేసే వ్యక్తుల సంఖ్యను పరిమితం చేయాలన్న UP అడ్మినిస్ట్రేషన్ నిర్ణయాన్ని అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. శాంతిభద్రతలను పరిరక్షించలేకపోతే SP, కలెక్టర్ బదిలీ చేయించుకోవాలని, లేదంటే రిజైన్ చేయాలని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రతి కమ్యూనిటీకి కేటాయించిన స్థలంలో శాంతియుతంగా ప్రార్థనలు చేసుకునేలా చేయడం ప్రభుత్వ విధి అని తెలిపింది.
News March 14, 2026
Vote Vibe సర్వే.. బెంగాల్ సీఎంగా మమతకే ఓటు!

త్వరలో WB అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో Vote Vibe సంస్థ చేసిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. తర్వాతి CMగా మమతా బెనర్జీ వైపు 42% మంది ఓటర్లు మొగ్గు చూపారు. BJP నేత సువేందు అధికారికి 19% మంది మద్దతు పలికారు. ప్రస్తుతం మమత ప్రభుత్వ పనితీరు అద్భుతమని 34%, చాలా దారుణమని 18% మంది పేర్కొన్నారు. TMC అక్రమ వలసలను ప్రోత్సహిస్తోందన్న BJP ఆరోపణలను 47% మంది నమ్మడం గమనార్హం.


