News March 25, 2024

సజ్జలపై ఈసీకి అచ్చెన్నాయుడు ఫిర్యాదు

image

AP: ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పదవిలో ఉంటూ రాజకీయ నేతలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. కోడ్ ఉల్లంఘిస్తూ ప్రెస్‌మీట్‌లు పెట్టి ప్రతిపక్షాలపై ఆరోపణలు చేశారని దుయ్యబట్టారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన సజ్జలను పదవి నుంచి తొలగించాలని ఈసీని కోరారు.

Similar News

News December 5, 2024

మిగ్‌లను కొనసాగించనున్న వాయుసేన

image

మిగ్-21 బైసన్ విమానాల్ని మరికొంత కాలం కొనసాగించాలని భారత వాయుసేన నిర్ణయించినట్లు తెలుస్తోంది. ‘ఎగిరే శవపేటికలు’గా పేరొందిన మిగ్‌లలో సమస్యల కారణంగా వందలాదిమంది పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. వీటిని ఈ ఏడాది డిసెంబరుకల్లా తప్పించాలని కేంద్రం నిర్ణయించింది. అయితే వాటి స్థానంలో రావాల్సిన తేజస్ MK1A విమానాల తయారీ లేట్ కావడంతో మిగ్‌లను మరికొంతకాలం కొనసాగించనున్నట్లు రక్షణ వర్గాలు తెలిపాయి.

News December 5, 2024

UAN యాక్టివేషన్ గడువు పొడిగింపు

image

కేంద్రం తీసుకొచ్చిన ELI పథకం ప్ర‌యోజ‌నాల కోసం ఆధార్ అనుసంధాన UAN యాక్టివేషన్ గడువును EPFO పొడిగించింది. నవంబర్ 30తోనే డెడ్‌లైన్ ముగియగా దాన్ని డిసెంబర్ 15 వరకు పెంచింది. ఈ స్కీం ద్వారా ఉద్యోగుల‌కు 3 విడ‌త‌ల్లో రూ.15 వేల వ‌ర‌కు సాయం అందుతుంది. ఉద్యోగికి, యజమానికి ప్రోత్సాహకాలు, ప్రతి కొత్త ఉద్యోగికి EPFO వాటాగా యజమానులు చెల్లించేందుకు రెండేళ్లపాటు నెలకు రూ.3వేల వరకు కేంద్రం ఇస్తుంది.

News December 5, 2024

పవర్ గ్రిడ్ పతనం.. క్యూబాలో అంధకారం

image

క్యూబాలో పవర్ గ్రిడ్ పతనం కావడంతో అంధకారం అలుముకుంది. దీంతో దేశంలోని పాఠశాలలు, పరిశ్రమలు, హోటళ్లు మూతపడ్డాయి. దేశంలోని లక్షలాది మంద ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఒక్కసారిగా ఆహారం, నీళ్లు, మందులు, ఇంధనం దొరకక జనం అల్లాడుతున్నారు. ఫోన్లు, ఫ్యాన్లు, టీవీలు మూగబోవడంతో దిక్కుతోచక ఎదురుచూస్తున్నారు. కాగా గ్రిడ్ పునరుద్ధరణ చర్యలు చేపట్టినట్లు ఆ దేశ విద్యుత్‌శాఖ మంత్రి విసెంటే డి లా ఒలెవీ తెలిపారు.