News March 28, 2025

కార్యకర్తలకు హ్యాట్సాఫ్: YS జగన్

image

AP: స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో CBN అధికార అహంకారాన్ని బేఖాతరు చేస్తూ MPTCలు, ZPTCలు YCP అభ్యర్థులను గెలిపించుకున్నారని YS జగన్ కొనియాడారు. విలువలు, విశ్వసనీయతకు పట్టం కట్టిన వారిని చూసి గర్వపడుతున్నానని పేర్కొన్నారు. క్లిష్ట సమయంలో వారు చూపిన ధైర్యం పార్టీకి మరింత ఉత్తేజాన్ని ఇచ్చిందని ట్వీట్ చేశారు. పార్టీకి ఎల్లప్పుడూ వెన్నెముకగా నిలుస్తున్న కార్యకర్తలకు హ్యాట్సాఫ్ చెప్పారు.

Similar News

News April 2, 2025

IPL: హ్యాట్రిక్‌పై కన్నేసిన RCB

image

ఐపీఎల్‌లో భాగంగా ఇవాళ ఆర్సీబీ-జీటీ జట్లు తలపడనున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఆర్సీబీ హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. కేకేఆర్, సీఎస్కేను వారి సొంత మైదానాల్లో ఓడించిన ఉత్సాహంలో జీటీపై కూడా విజయం సాధించాలని పాటీదార్ సేన భావిస్తోంది. మరోవైపు గుజరాత్ కూడా ఆర్సీబీని తన సొంతగడ్డపైనే ఓడించాలని యోచిస్తోంది.

News April 2, 2025

ఎండాకాలంలో ఈ ఆహారం తింటున్నారా?

image

సమ్మర్‌లో ఆరోగ్య నియమాలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. లేదంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు. ఉదయం ఆవిరితో చేసిన ఇడ్లీలు, కుడుములు తినాలి. మాంసాహారం, వేపుళ్లకు దూరంగా ఉండాలి. భోజనంలో ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి. నిల్వ పచ్చళ్లను పరిమితంగా తీసుకోవాలి. మామిడి, పుచ్చకాయ వంటి పండ్లను తినాలి. మజ్జిక, కొబ్బరి నీళ్లు, నిమ్మరసం తాగాలి. కూల్ డ్రింక్స్, కాఫీ, టీలకు దూరంగా ఉండటం బెటర్.

News April 2, 2025

DANGER: రీల్స్ ఎక్కువగా చూస్తున్నారా?

image

స్మార్ట్ ఫోన్లలో విపరీతంగా రీల్స్, షార్ట్స్ చూడటం వ్యసనంగా మారింది. దీనివల్ల బ్రెయిన్ రాట్(మేధో క్షీణత), కంటి జబ్బులు అధికమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లల్లో మెల్లకన్ను, డ్రై ఐ సిండ్రోమ్, మయోపియా కేసులు, పెద్దల్లో మైగ్రేన్, నిద్రలేమి సమస్యలు పెరుగుతున్నాయంటున్నారు. 20-20-20 రూల్(20ని.కోసారి 20సె.పాటు 20మీ. దూరంలో వస్తువులపై దృష్టి పెట్టడం) పాటించాలని సూచిస్తున్నారు.

error: Content is protected !!