News March 25, 2024
రామ్ చరణ్ బర్త్ డే.. CDP ఇదే

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ ‘కామన్ డీపీ’ని విడుదల చేసింది. ‘ఇండియా సినిమాకి గేమ్ ఛేంజర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సీడీపీని విడుదల చేశాం. తన అభిరుచి, నిబద్ధతతో మెగాస్టార్ లెగసీని గ్లోబల్ వేదికపైకి తీసుకెళ్లారు’ అని ట్వీట్‌లో పేర్కొంది. కాగా, ఆయన ఫ్యాన్స్ అంతా తమ సోషల్ మీడియా డీపీలో ఈ పోస్టర్‌ను ఉంచనున్నారు.
Similar News
News March 25, 2026
IPL: కెప్టెన్లంతా ఒకే చోట

ఐపీఎల్-2026 సందడి మొదలైంది. లీగ్‌లో పాల్గొనే పది జట్ల కెప్టెన్లు ముంబైలో ఒకేచోట కలుసుకున్నారు. సీజన్ ప్రారంభానికి ముందు ఏటా జరిగే ‘కెప్టెన్స్ ఫొటోషూట్’లో వీరంతా పాల్గొన్నారు. హార్దిక్ పాండ్య, రుతురాజ్ గైక్వాడ్, రజత్, పంత్, కిషన్, రహానే, పరాగ్, అక్షర్, గిల్, శ్రేయస్ కలిసున్న ఫొటోలను IPL పంచుకుంది. ఈ నెల 28 నుంచి ఈ క్రికెట్ పండుగ షురూ కానున్న విషయం తెలిసిందే.
News March 25, 2026
ఫ్రూట్-ఫ్లేవర్డ్ బీర్లు ఇక రానట్లే

TG: రాష్ట్రంలో పండ్లు, ఇతర ఫ్లేవర్డ్ బీర్లను అందుబాటులోకి తెచ్చేందుకు GOVT గతంలో మైక్రో బ్రూవరీల ఏర్పాటు కోసం టెండర్ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ బ్రూవరీల ద్వారా ప్రతినెల ₹100CR ఆదాయాన్ని ఆర్జించవచ్చనుకుంది. HYDలో 100కు పైగా, ఇతర కార్పొరేషన్లలో20కి పైగా దరఖాస్తులు అందాయి. అయితే టెండర్లు దాఖలు చేసిన కాంట్రాక్టర్లకు మైక్రోబ్రూవరీల ఏర్పాటుకు అవసరమైన అర్హతలు లేకపోవడంతో దరఖాస్తులను తిరస్కరించింది.
News March 25, 2026
హార్ముజ్: పాక్ నౌకకు ఝలక్ ఇచ్చిన ఇరాన్

పశ్చిమాసియా యుద్ధం వేళ పాక్‌కు ఇరాన్ ఝలక్ ఇచ్చింది. హార్ముజ్ నుంచి కరాచీ వెళ్తున్న పాక్ నౌకను వెనక్కి రప్పించినట్లు IRGC తెలిపింది. హార్ముజ్ నుంచి వెళ్లేందుకు అనుమతి తీసుకోలేదని, అందుకే అడ్డుకున్నట్లు పేర్కొంది. ఈ విషయాన్ని కాబూల్‌లోని ఇరాన్ కార్యాలయం ధ్రువీకరించింది. జలసంధి నుంచి వెళ్లే ప్రతినౌక ఇరాన్ అధికార యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలని, లేకపోతే తాము జోక్యం చేసుకుంటామని IRGC హెచ్చరించింది.


