News March 25, 2024
రామ్ చరణ్ బర్త్ డే.. CDP ఇదే
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్ ‘కామన్ డీపీ’ని విడుదల చేసింది. ‘ఇండియా సినిమాకి గేమ్ ఛేంజర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే సీడీపీని విడుదల చేశాం. తన అభిరుచి, నిబద్ధతతో మెగాస్టార్ లెగసీని గ్లోబల్ వేదికపైకి తీసుకెళ్లారు’ అని ట్వీట్‌లో పేర్కొంది. కాగా, ఆయన ఫ్యాన్స్ అంతా తమ సోషల్ మీడియా డీపీలో ఈ పోస్టర్‌ను ఉంచనున్నారు.
Similar News
News November 5, 2024
షమీని వదలనంటున్న బ్యాడ్ లక్!
భారత జట్టులోకి తిరిగిరావడానికి ప్రయత్నిస్తున్న పేసర్ మహ్మద్ షమీకి షాక్ తగిలింది. రంజీ ట్రోఫీ నెక్స్ట్ రెండు రౌండ్లకు బెంగాల్ టీమ్‌లో అతనికి చోటు దక్కలేదు. అక్కడ ఆడి ఫిట్‌నెస్ నిరూపించుకోవాలనుకున్న అతనికి ఇది బ్యాడ్ లక్ అని చెప్పవచ్చు. 2023 ODI WC తర్వాత గాయం కారణంగా జాతీయ జట్టుకు దూరమైన షమీ, సర్జరీ తర్వాత కోలుకుని బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించారు. ఇటీవల తాను 100% ఫిట్‌నెస్ సాధించినట్లు చెప్పారు.
News November 5, 2024
సామాన్యులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్!
AP: భారీగా పెరిగిన నిత్యావసర ధరలతో సతమతం అవుతున్న సామాన్యులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సబ్సిడీ ధరలపై సరకులు అందజేసేందుకు సిద్ధమవుతోంది. లీటర్ పామాయిల్ రూ.110, కేజీ కందిపప్పు రూ.67, అరకేజీ చక్కెర 16 రూపాయలకే అందించాలని మంత్రులు నాదెండ్ల, పయ్యావుల, అచ్చెన్నాయుడుతో కూడిన కమిటీ నిర్ణయించింది. రైతు బజార్లతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 2200 రిటైల్ ఔట్‌లెట్ల ద్వారా సరకులు విక్రయించనుంది.
News November 5, 2024
గ్రాడ్యుయేట్లకు అలర్ట్.. రేపే లాస్ట్ డేట్
TG: కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ స్థానాల ఓటర్ నమోదు గడువు రేపటితో ముగియనుంది. 2019తో (1.96లక్షలు) పోల్చితే ప్రస్తుతం ఓటరు దరఖాస్తుల సంఖ్య(2.40 లక్షలు) పెరిగింది. అయినా ఇంకా సగం మంది గ్రాడ్యుయేట్లు ఓటు నమోదుకు దూరంగా ఉన్నట్లు సమాచారం. ఈనెల 23న డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్, అభ్యంతరాల స్వీకరణ తర్వాత డిసెంబర్ 30న ఫైనల్ లిస్ట్‌ను రిలీజ్ చేస్తామని అధికారులు తెలిపారు.