News March 29, 2025

పల్నాడు: మాతృ మరణాలపై ప్రత్యేక సమావేశం 

image

పల్నాడు జిల్లాలో మాతృ మరణాలపై ప్రత్యేక సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ సూరజ్ గనూరే ఆధ్వర్యంలో నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. గర్భిణీలకు శ్రద్ధతో వైద్య పరీక్షలను అందించాలన్నారు. జిల్లాలో ఎడ్లపాడు, సిరిగిరిపాడు, ఆరేపల్లి, ముప్పాళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో జరిగిన మాతృ మరణాల గురించి చర్చించారు. రక్తహీనత సమస్యలు ఉంటే వెంటనే వైద్యం అందించాలని, ప్రసవ సమయంలోను జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. 

Similar News

News April 2, 2025

‘లాపతా లేడీస్’ కథ దొంగిలించారా?.. రెడిట్ యూజర్ పోస్ట్ వైరల్

image

ఆస్కార్‌కు నామినేట్ అయిన ‘లాపతా లేడీస్’పై SMలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘బుర్ఖా సిటీ’ అనే షార్ట్ ఫిల్మ్ నుంచి కథను కాపీ కొట్టారని ఆరోపిస్తూ ఓ రెడిట్ యూజర్ పోస్ట్ చేశారు. దీంతో ఆమిర్, ఆయన మాజీ భార్య కిరణ్ రావు ఈ స్టోరీని దొంగిలించారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటివి చేయడంలో వారెప్పుడూ నిరాశపరచరని సెటైర్లు వేస్తున్నారు. కిరణ్ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2023లో విడుదలైంది.

News April 2, 2025

రేపు కర్నూలుకు YS జగన్ రాక.!

image

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు కర్నూలుకు రానున్నారు. ఉదయం 9:30కు తాడేపల్లి నివాసం నుంచి బయలు దేరి 11:45కు కర్నూలుకు చేరుకుంటారు. అనంతరం కర్నూలు GRC కన్వెన్షన్ హాల్లో జరిగే కోడుమూరు నియోజకవర్గ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి కూతురి వివాహా కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ కార్యాలయం తెలిపింది. దీంతో జగన్ రాకకు జిల్లా వైసీపీ నాయకులు ఏర్పాట్లను పూర్తి చేశారు.

News April 2, 2025

నిర్మల్: నేటితో ముగియనున్న పది పరీక్షలు

image

నిర్మల్ జిల్లాలో గత నెల మార్చి 21న ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు నేటీతో ముగియనున్నాయి. పది పరీక్షల కోసం జిల్లా వ్యాప్తంగా 43 పరీక్ష కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేసి పరీక్షలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేపట్టారు. నేడు సాంఘిక శాస్త్రం పరీక్షతో పది పరీక్షలు ముగియనున్నాయి.

error: Content is protected !!