News March 29, 2025

OFFICIAL: 1000 మంది మరణం

image

మయన్మార్‌లో సంభవించిన భారీ భూకంపం వేలాది మంది ప్రాణాలను బలిగొంటోంది. ఇప్పటివరకూ 1000 మందికి పైగా ప్రజలు చనిపోయినట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. 2000 మంది గాయపడ్డట్లు పేర్కొన్నాయి. క్షతగాత్రులతో ఆసుపత్రులు నిండిపోయాయి. చాలామంది సాయం కోసం ఎదురుచూస్తుండటంతో హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈక్రమంలోనే భారత్ తనవంతు సాయంగా 15 టన్నుల ఆహారపదార్థాలను మయన్మార్‌కు పంపింది.

Similar News

News January 27, 2026

గ్రిడ్‌ బలోపేతానికి రూ.9319.30 కోట్లు

image

AP: రాష్ట్రంలో పవర్ గ్రిడ్‌ను బలోపేతం చేసేందుకు రూ.9,319.30 కోట్లతో 55 ట్రాన్స్‌మిషన్‌ ప్రాజెక్టులు చేపడుతున్నట్లు ట్రాన్స్‌కో జేఎండీ ప్రవీణ్‌ చంద్‌ తెలిపారు. వీటితో గ్రిడ్‌కు అదనంగా 8,853 MVA సామర్థ్యం చేరనుందని అన్నారు. ఇప్పటికే 3,240 MVA విస్తరణతో పాటు 950 సర్క్యూట్‌ కిలోమీటర్ల లైన్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కొత్త ప్రాజెక్టులతో మరో 1,558 సర్క్యూట్‌ కి.మీ. అందుబాటులోకి వస్తాయన్నారు.

News January 27, 2026

దానిమ్మలో బ్యాక్టీరియా మచ్చ తెగులు

image

దానిమ్మలో బ్యాక్టీరియా మచ్చ తెగులు పంట దిగుబడిని, కాపుకొచ్చిన కాయల నాణ్యతనూ తగ్గిస్తోంది. తెగులుకు కారణమయ్యే బ్యాక్టీరియా.. మొక్క ఆకులు, రెమ్మలు, కాయలపైన మచ్చలను కలగజేస్తుంది. ఈ తెగులుకు గురైన మొక్క ఆకులు రాలిపోవడం, కొమ్మలు విరిగిపోవడం జరుగుతుంది. కాయలపై ముదురు గోధుమ రంగు నుంచి నలుపు రంగు గరుకు మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చల మధ్యభాగంలో కాయలపై పగుళ్లు ఏర్పడి మార్కెట్‌కు పనికిరాకుండాపోతాయి.

News January 27, 2026

ఛలో మేడారం.. రేపే మహాజాతర ప్రారంభం

image

TG: ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం గిరిజన మహాజాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి నుంచి సమ్మక్క-సారలమ్మ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈసారి జాతరను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం రూ.251Crతో ఆలయ పునరుద్ధరణ చేపట్టింది. సుమారు 3Cr మంది భక్తులు వస్తారని అధికారుల అంచనా. రాష్ట్రం నలుమూలల నుంచి TGSRTC 4వేల ప్రత్యేక బస్సులు నడుపుతోంది. 15 వేల మంది సిబ్బందితో పోలీసు శాఖ భారీ బందోబస్తు నిర్వహిస్తోంది.