News March 29, 2025
OFFICIAL: 1000 మంది మరణం

మయన్మార్‌లో సంభవించిన భారీ భూకంపం వేలాది మంది ప్రాణాలను బలిగొంటోంది. ఇప్పటివరకూ 1000 మందికి పైగా ప్రజలు చనిపోయినట్లు అధికార వర్గాలు ప్రకటించాయి. 2000 మంది గాయపడ్డట్లు పేర్కొన్నాయి. క్షతగాత్రులతో ఆసుపత్రులు నిండిపోయాయి. చాలామంది సాయం కోసం ఎదురుచూస్తుండటంతో హృదయవిదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈక్రమంలోనే భారత్ తనవంతు సాయంగా 15 టన్నుల ఆహారపదార్థాలను మయన్మార్‌కు పంపింది.
Similar News
News April 21, 2025
లాభాల బాటలో స్టాక్ మార్కెట్లు

ఇండియన్ షేర్ మార్కెట్ లాభాల బాటలో దూసుకుపోతుంది. ఉదయం 518 పాయింట్లు లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ 939 పాయింట్లు పెరిగి 79,492 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 329 పాయింట్లు లాభపడి 24,158 వద్ద కొనసాగుతోంది. టాటా, ఐడియా, HDFC, ఏంజిల్ వన్ కంపెనీలు టాప్ గైనర్‌లుగా ఉన్నాయి.
News April 21, 2025
రేపు సిట్ విచారణకు రాజ్ కసిరెడ్డి

ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డి రేపు సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఈమేరకు ఆయన అధికారులకు సమాచారం ఇచ్చారు. రాజ్‌ను విచారించేందుకు సిట్ ఇప్పటికే నాలుగుసార్లు నోటీసులు ఇచ్చింది. అప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. ఈక్రమంలోనే హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా, విచారణను న్యాయస్థానం వచ్చేవారానికి వాయిదా వేసింది.
News April 21, 2025
JEE MAINS.. ఒకే గ్రామంలో 40 మంది పాస్!

సాధారణంగా ఓ గ్రామంలో ఒకరో, ఇద్దరో JEE మెయిన్స్‌లో ఉత్తీర్ణులవుతుంటారు. కానీ, బిహార్‌లోని పట్వటోలి అనే గ్రామంలో ఏకంగా 40 మంది మెయిన్స్ ఫలితాల్లో సత్తాచాటారు. ఇందులో గ్రామంలో ఉచితంగా కోచింగ్ ఇస్తోన్న ‘వృక్ష సంస్థాన్’ నుంచి 28 మంది ఉన్నారు. ఈ గ్రామంలో ఇంటికో ఇంజినీర్ ఉండటం విశేషం. ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని, ప్రతిచోట ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసుకుంటే విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుంది.