News March 25, 2024
వాట్సాప్‌లో మరో ప్రైవసీ ఫీచర్

వాట్సాప్‌లో మరో ప్రైవసీ ఫీచర్ రానుంది. దీనితో యూజర్లు తమ అవతార్‌ను ఇతరులెవరూ స్టిక్కర్స్‌లో వాడకుండా నియంత్రించవచ్చు. ఎవరెవరు మన అవతార్‌ని వాడుకోవచ్చో నిర్ణయించుకునే వెసులుబాటు యూజర్లకు ఉంటుంది. ఇందులో మై కాంటాక్ట్స్, సెలెక్టెడ్ కాంటాక్ట్స్, Nobody అనే మూడు ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో ఏదో ఒకటి మనం ఎంచుకోవచ్చు. ప్రస్తుతం డెవలప్‌మెంట్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.
Similar News
News September 14, 2025
SBIలో 122 పోస్టులు

<
News September 14, 2025
కేజీ చికెన్ ధర రూ.280.. ఎక్కడంటే?

తెలుగు రాష్ట్రాల్లోని పలు చోట్ల చికెన్ ధరలు గత వారంతో పోలిస్తే స్వల్పంగా పెరిగాయి. TGలోని హైదరాబాద్, కామారెడ్డి, ఖమ్మంతో పాటు APలోని విజయవాడ, గుంటూరు, నంద్యాల, పల్నాడు, తూ.గో తదితర నగరాల్లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.230-240కి విక్రయిస్తున్నారు. అత్యధికంగా తిరుపతిలో రూ.280, అత్యల్పంగా కాకినాడలో రూ.220-230గా ఉంది. మీ ఏరియాలో రేట్ ఎంత? COMMENT
News September 14, 2025
గొర్రెల్లో చిటుక వ్యాధి ఎలా వస్తుంది?

గొర్రెలకు సోకే ప్రమాదకరమైన వ్యాధుల్లో ‘చిటుక వ్యాధి’ ఒకటి. ఈ వ్యాధి సోకిన గొర్రెలు త్వరగా మరణిస్తాయి. అందుకే దీన్ని ‘చిటుక వ్యాధి’ అని పిలుస్తారు. ఇది ‘క్లాస్ట్రీడియం పర్ఫింజన్స్ టైప్-డి’ అనే బ్యాక్టీరియా వల్ల వస్తుంది. వర్షాకాలంలో తేమతో కూడిన పచ్చగడ్డిని గొర్రెలు తిన్నప్పుడు చిటుక వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వెటర్నరీ వైద్యులు చెబుతున్నారు.