News March 25, 2024
వాట్సాప్‌లో మరో ప్రైవసీ ఫీచర్

వాట్సాప్‌లో మరో ప్రైవసీ ఫీచర్ రానుంది. దీనితో యూజర్లు తమ అవతార్‌ను ఇతరులెవరూ స్టిక్కర్స్‌లో వాడకుండా నియంత్రించవచ్చు. ఎవరెవరు మన అవతార్‌ని వాడుకోవచ్చో నిర్ణయించుకునే వెసులుబాటు యూజర్లకు ఉంటుంది. ఇందులో మై కాంటాక్ట్స్, సెలెక్టెడ్ కాంటాక్ట్స్, Nobody అనే మూడు ఆప్షన్స్ ఉంటాయి. వీటిలో ఏదో ఒకటి మనం ఎంచుకోవచ్చు. ప్రస్తుతం డెవలప్‌మెంట్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది.
Similar News
News December 11, 2025
పిల్లలకు SM బ్యాన్ చేయాలి: సోనూసూద్

AUS తరహాలో INDలోనూ U16 పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా నటుడు సోనూసూద్ కూడా ఇదే విషయాన్ని Xలో పోస్ట్ చేశారు. పిల్లలు స్క్రీన్ అడిక్షన్‌కు దూరమై నిజమైన బాల్యాన్ని గడపాలని, కుటుంబ బంధాలు బలపడాలని ఆయన పేర్కొన్నారు. దీనికి నెటిజన్ల నుంచి మద్దతు లభిస్తోంది. అయితే పేరెంట్స్ ఫోన్లకు అతుక్కుపోతుంటే పిల్లలెలా మారుతారని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మీ COMMENT.
News December 11, 2025
ఇంటర్వ్యూతో ESICలో ఉద్యోగాలు

ESIC పట్నా 36 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 12న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD, MS, DNB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 45ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.500, SC,STలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://esic.gov.in
News December 11, 2025
పిల్లలకు ఇవి నేర్పిస్తున్నారా?

ప్రస్తుతకాలంలో పిల్లల్ని పెంచడం అనేది కత్తిమీద సాములా మారింది. కొందరు తల్లిదండ్రులు మితిమీరిన స్వేచ్ఛను ఇస్తుంటే.. మరికొందరు అతి క్రమశిక్షణతో పంజరంలో పక్షుల్లా పెంచుతున్నారు. ఈ రెండు విధానాల వల్ల పిల్లలు భవిష్యత్తులో ఇబ్బందులు పడతారు. వారికి ముఖ్యంగా పరోపకార గుణం, యాంగర్ మేనేజ్‌మెంట్, గౌరవం, ప్రేమానురాగాలు, బాధ్యత, కార్యదక్షత, తప్పును అంగీకరించడం, సమయపాలన నేర్పించాలని నిపుణులు సూచిస్తున్నారు.


