News March 31, 2025

ముస్లిం సోదరులకు గవర్నర్, సీఎం రంజాన్ శుభాకాంక్షలు

image

AP: రాష్ట్రంలోని ముస్లింలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, CM చంద్రబాబు, మాజీ CM జగన్ పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు అల్లా దయతో విజయవంతం కావాలని CM కోరారు. జకాత్ పేరుతో సాటివారిని ఆదుకునే దయా గుణం ముస్లిం వర్గంలోని మానవత్వానికి ప్రతిరూపం అన్నారు. అల్లా చూపిన మార్గంలో న‌డవాల‌ని, అంద‌రిపై ఆయన దీవెనలు ఉండాల‌ని కోరుకుంటున్నట్లు జగన్ పేర్కొన్నారు.

Similar News

News January 7, 2026

మరో 16,666 ఎకరాలు.. నేటి నుంచి రెండో విడత భూసమీకరణ

image

AP: అమరావతిలో రెండో విడత భూసమీకరణ నేటి నుంచి మొదలవనుంది. తుళ్లూరు, అమరావతి మండలాల్లోని 7 గ్రామాల(వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి, వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి) రైతుల నుంచి 16,666 ఎకరాలను CRDA సమీకరించనుంది. ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్ సిటీ, రైల్వే ట్రాక్, IRR కోసం ఈ భూములు అవసరమని ప్రభుత్వం చెబుతోంది. భూములిచ్చిన రైతులకు వేగంగా స్థలాలను అప్పగిస్తామని హామీ ఇచ్చింది.

News January 7, 2026

పీసీఓడీ ఉంటే ఏమవుతుందంటే..

image

పీసీఓడీ ఉన్నవారిలో ఎఫ్‌ఎస్‌హెచ్, ఎల్‌హెచ్, టెస్టోస్టిరాన్, ఇన్సులిన్‌ వంటి హార్మోన్లు స్త్రీల ఇతరత్రా వ్యవస్థలపై ప్రభావం చూపుతాయి. దీంతో ఊబకాయం, నెలసరి సమస్యలు, మొటిమలు, టైప్‌–2 డయాబెటిస్‌, బీపీ, కొలెస్ట్రాల్‌ పెరగడం వంటి సమస్యలు వస్తాయి. దీంతో బాధితులు ఒత్తిడికి గురవుతాయి. దీనివల్ల సమస్య మరింత పెరుగుతుంది. కాబట్టి ఒత్తిడి తగ్గించుకొనేందుకు ధ్యానం, యోగా వంటివి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

News January 7, 2026

కోరిన వ్యక్తి జీవిత భాగస్వామిగా రావాలంటే?

image

కోరిన వ్యక్తే జీవిత భాగస్వామి అవ్వాలంటే మనసుని, సంకల్పాన్ని ఏకం చేసే కామరాజ మంత్రం’ లేదా ‘కాత్యాయని వ్రతం’ చేయాలని పండితులు సూచిస్తున్నారు. ‘స్నానానంతరం పసుపు వస్త్రాలు ధరించి, లక్ష్మీనారాయణుల ఫొటో ముందు నెయ్యితో దీపం వెలిగించి కోరికను నివేదించాలి. గోమాతకు బెల్లం కలిపిన అరటిపండ్లు తినిపిస్తూ ప్రదక్షిణలు చేయడం వల్ల ప్రేమ సఫలమై, ఆటంకాలు తొలగి కోరుకున్న వ్యక్తితో వివాహ బంధం బలపడుతుంది’ అంటున్నారు.