News March 31, 2025

200 సిక్సర్లు.. ధోనీ అరుదైన రికార్డు

image

CSK ప్లేయర్ ధోనీ అరుదైన రికార్డు నెలకొల్పారు. 30 ఏళ్ల వయసు దాటాక ఐపీఎల్‌లో 200 సిక్సులు బాదిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా నిలిచారు. ప్రస్తుతం 43వ వడిలో ఉన్న మిస్టర్ కూల్ నిన్న RRతో మ్యాచ్‌లో తుషార్ వేసిన 19వ ఓవర్‌లో సిక్స్ కొట్టడం ద్వారా ఈ ఘనత సాధించారు. ఓవరాల్‌గా క్రిస్‌గేల్(347) ఎవరికీ అందనంత దూరంలో ఉన్నారు. ఇక ధోనీ తర్వాత రోహిత్(113), అంబటి రాయుడు(109), దినేశ్ కార్తీక్(104) ఉన్నారు.

Similar News

News April 6, 2025

BREAKING: టాస్ గెలిచిన GT

image

IPL2025: ఉప్పల్ వేదికగా SRHతో జరుగుతున్న మ్యాచ్‌లో GT కెప్టెన్ గిల్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు.
GT: సాయి సుదర్శన్, గిల్, బట్లర్, తెవాటియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, సుందర్, సాయి కిషోర్, సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఇషాంత్
SRH: హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్, క్లాసెన్, అనికేత్, కమిందు, కమిన్స్, అన్సారీ, ఉనద్కత్, షమీ

News April 6, 2025

కంచంలో సన్నబియ్యం.. కళ్లల్లో ఆనందం స్వయంగా చూశా: CM

image

TG: భద్రాచలం పర్యటనలో భాగంగా సారపాకలో ఓ రేషన్ లబ్ధిదారుడి ఇంట సన్నబియ్యంతో భోజనం చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. ‘పేదవాడి ఇంట కంచంలో సన్నబియ్యం, కళ్లల్లో ఆనందం స్వయంగా చూశా. సారపాకలో లబ్ధిదారుల ఇంట సహపంక్తి భోజనం చేసి పథకం అమలును స్వయంగా పరిశీలించా’ అంటూ సీఎం రాసుకొచ్చారు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం, తెలంగాణ రైజింగ్ అంటూ హ్యాష్‌ట్యాగ్‌లను జతపరిచారు.

News April 6, 2025

IPL: MI ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్

image

ముంబై జట్టుకు గుడ్‌న్యూస్. నిన్న జట్టుతో చేరిన స్టార్ పేసర్ బుమ్రా రేపు RCBతో జరిగే MI ప్లేయింగ్ 11కు అందుబాటులో ఉండనున్నారు. నెట్స్‌లో ఈ స్పీడ్ గన్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నట్లు హెడ్ కోచ్ జయవర్దనే వెల్లడించారు. రేపు RCBతో జరిగే మ్యాచ్‌కు మ్యాచ్‌లో ఆడే వీలుందని ఆయన చెప్పారు. కాగా తొలుత రేపు జరిగే మ్యాచ్‌కు బుమ్రా అందుబాటులో ఉండరనే ప్రచారం జరిగింది.

error: Content is protected !!