News April 1, 2025

అత్యంత ఖరీదైన చాక్లెట్.. 50gmsకి రూ.3.2లక్షలు

image

చాక్లెట్‌ను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. కొందరికైతే అత్యంత ఖరీదైన, అరుదైన చాక్లెట్స్ తినాలనే కోరిక ఉంటుంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన చాక్లెట్ ‘To’ak’ గురించి మీకు తెలుసా? ‘To’ak’ 50gms బార్ ధర $3,850 (సుమారు రూ. 3.29లక్షలు). ఏంటి షాక్ అవుతున్నారా? దీనిని అరుదైన, పురాతన కోకో గింజల నుంచి తయారు చేస్తారు. చేతితో తయారు చేసిన గోల్డ్ ప్లేటెడ్ చెక్క బాక్సులో పెట్టి అమ్ముతారు. అందుకే ఇంత ధర.

Similar News

News April 3, 2025

రామాయణ థీమ్‌తో థాయ్‌లాండ్‌ ఐస్టాంప్

image

థాయ్‌లాండ్‌లో PM మోదీ పర్యటనకు గుర్తుగా అక్కడి ప్రభుత్వం రామాయణ థీమ్‌తో ఐస్టాంప్‌ను విడుదల చేసింది. ఇది రెండు దేశాల సాంస్కృతిక సంబంధాలకు ఓ చిహ్నమని మోదీ ట్వీట్ చేశారు. థాయ్‌లాండ్ ఫౌండర్ కింగ్ రామ-1 పాలనలో చిత్రించిన రామకేయిన్(ఇతిహాసం) కుడ్య చిత్రాలను ఇది వర్ణిస్తుందని పేర్కొన్నారు. అలాగే పాలీ భాషలో బుద్ధిజంపై రాసిన టిపిటక కాపీని బహూకరించిన ప్రధాని పేటోంగ్‌టార్న్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

News April 3, 2025

KCRకు హైకోర్టులో ఊరట

image

TG: మాజీ సీఎం కేసీఆర్‌కు హైకోర్టులో ఊరట దక్కింది. 2011లో ఆయనపై నమోదైన రైలురోకో కేసును హైకోర్టు కొట్టేసింది. ఉద్యమ సమయంలో ఆగస్టు 15న సికింద్రాబాద్‌లో KCR రైలురోకో చేపట్టారు. దీంతో ఆయనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై కేసీఆర్ కోర్టును ఆశ్రయించగా, కొట్టివేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.

News April 3, 2025

మళ్లీ కెమెరా ముందుకు స్మృతీ ఇరానీ?

image

కేంద్ర మాజీ మంత్రి స్మృతీ ఇరానీ సినీ ఇండస్ట్రీలో రీఎంట్రీకి సిద్ధమవుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఓ వెబ్ సిరీస్‌లో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఏక్తా కపూర్ తీసిన ‘క్యోంకీ సాస్ భీ కభీ బహు థీ’ సీరియల్ స్మృతికి పేరు తెచ్చింది. ఇప్పుడు దాన్నే సిరీస్‌గా రూపొందించాలని డైరెక్టర్ భావిస్తున్నారని టాక్. 2019లో అమేథీలో రాహుల్ గాంధీపై గెలిచిన స్మృతి 2024లో కిశోరీలాల్(INC) చేతిలో ఓడిన విషయం తెలిసిందే.

error: Content is protected !!