News April 1, 2025
అత్యంత ఖరీదైన చాక్లెట్.. 50gmsకి రూ.3.2లక్షలు

చాక్లెట్‌ను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి. కొందరికైతే అత్యంత ఖరీదైన, అరుదైన చాక్లెట్స్ తినాలనే కోరిక ఉంటుంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన చాక్లెట్ ‘To’ak’ గురించి మీకు తెలుసా? ‘To’ak’ 50gms బార్ ధర $3,850 (సుమారు రూ. 3.29లక్షలు). ఏంటి షాక్ అవుతున్నారా? దీనిని అరుదైన, పురాతన కోకో గింజల నుంచి తయారు చేస్తారు. చేతితో తయారు చేసిన గోల్డ్ ప్లేటెడ్ చెక్క బాక్సులో పెట్టి అమ్ముతారు. అందుకే ఇంత ధర.
Similar News
News April 19, 2025
ఈ అలవాట్లతో మీ లివర్ రిస్క్‌లో పడ్డట్లే..

చక్కెర అధికంగా ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల అది కొవ్వుగా మారి ఫ్యాటీ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్రై ఫుడ్స్ కాలేయంపై భారాన్ని పెంచుతాయి. మాంసం అధికంగా తినడం వల్ల శరీరంలో అమ్మోనియా స్థాయులు పెరుగుతాయి. పెయిన్ కిల్లర్స్, వెయిట్ లాస్ మెడిసిన్స్ వల్ల కాలేయంపై ప్రభావం పడే అవకాశముంది. లివర్ చెడిపోవడానికి ఆల్కహాల్ ప్రధాన కారణమని, కనుక ఈ అలవాటును పూర్తిగా మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
News April 19, 2025
ప్రభుత్వ భూమిని ‘వసంత హోమ్స్’ ఆక్రమించింది: హైడ్రా

హైదరాబాద్ హఫీజ్‌పేట్ సర్వే నంబర్ 79లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా వివరణ ఇచ్చింది. ‘39.2 ఎకరాల్లో సగానికిపైగా ఆక్రమణలు జరిగాయి. అది ప్రభుత్వ నిషేధిత భూమిగా రెవెన్యూ రికార్డుల్లో ఉంది. సర్వే నం.79/1 పేరుతో ప్రభుత్వాన్ని ‘వసంత హోమ్స్’ తప్పుదోవ పట్టించింది. 19 ఎకరాలు ఆక్రమించి ఇళ్లు కట్టి అమ్మేశారు. ఖాళీగా ఉన్న మరో 20 ఎకరాల్లోనూ నిర్మాణాలు చేపట్టారు’ అని వివరించింది.
News April 19, 2025
KKR అసిస్టెంట్ కోచ్‌గా అభిషేక్ నాయర్

భారత జట్టు మాజీ సహాయక కోచ్ అభిషేక్ నాయర్ తిరిగి కేకేఆర్ జట్టుతో చేరారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘వెల్కమ్ బ్యాక్ హోమ్’ అంటూ KKR ట్వీట్ చేసింది. గతంలో అభిషేక్ KKR కోచింగ్ సిబ్బందిలో పనిచేసిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా సిరీస్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో నాయర్‌పై BCCI వేటు వేసినట్లుగా తెలుస్తోంది.