News April 3, 2025

ఇరిగేషన్ మంత్రి నిమ్మలతో బత్తుల భేటీ

image

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్,జిల్లా టీడీపీ అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. పాలకొల్లులోని వారి క్యాంపు కార్యాలయంలో మంత్రితో భేటీ అయ్యారు.ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లాలో వివిధ సమస్యలపై మంత్రితో చర్చించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులు, గ్రోయిన్లకి మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలని కోరారు.

Similar News

News April 4, 2025

నేరుగా OTTలోకి కొత్త సినిమా

image

మాధవన్, సిద్ధార్థ్, నయనతార ప్రధాన పాత్రల్లో నటించిన ‘టెస్ట్’ సినిమా OTTలో విడుదలైంది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎస్.శశికాంత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను చక్రవర్తి రామచంద్ర నిర్మించారు. చెన్నైలో జరిగిన ఓ ఇంటర్నేషనల్ టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ముగ్గురి జీవితాలను ఎలా మార్చిందనే స్టోరీ లైన్‌తో ఈ స్పోర్ట్ డ్రామా రూపొందింది.

News April 4, 2025

గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో అవకతవకలు: BRS నేత

image

TG: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల్లో అవకతవకలు జరిగాయని BRS నేత రాకేశ్ రెడ్డి ఆరోపించారు. ‘గ్రూప్-1 అభ్యర్థుల్లో 40% మంది తెలుగు మీడియం వారు ఉన్నారు. వారిలో ఒక్కరు కూడా టాప్ ర్యాంకర్లలో లేరు. మొత్తం 46 సెంటర్లలో పరీక్షలు జరగగా, కేవలం 2 సెంటర్ల నుంచే 72 మంది టాపర్లున్నారు. 25 సెంటర్ల నుంచి ఒక్కరికీ టాప్ ర్యాంక్ రాలేదు. ఇదెలా సాధ్యం’ అని ప్రశ్నించారు. 18, 19వ సెంటర్లలో ఏదో గోల్ మాల్ జరిగిందన్నారు.

News April 4, 2025

SRH కెప్టెన్ కమిన్స్ చెత్త రికార్డ్

image

SRH కెప్టెన్ కమిన్స్ IPL చరిత్రలో ఓ చెత్త రికార్డ్ మూటగట్టుకున్నారు. నిన్న KKR మ్యాచ్‌తో సహా 7సార్లు 50+ పరుగులు ఇచ్చిన బౌలర్‌గా మోహిత్‌శర్మతో పాటు టాప్‌లో నిలిచారు. మరోవైపు, ఈ లిస్టులో సునీల్ నరైన్ చిట్టచివర ఉన్నారు. 14ఏళ్లుగా లీగ్ ఆడుతూ ఒక్కసారి కూడా 50+ రన్స్ ఇవ్వలేదంటే ఎంత ఎఫెక్టివ్‌గా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇన్నేళ్లుగా అతని బౌలింగ్‌ను డీకోడ్ చేయలేకపోవడం గొప్ప విషయమని ఫ్యాన్స్ అంటున్నారు.

error: Content is protected !!