News April 4, 2025

BREAKING: SRH ఘోర ఓటమి

image

SRH హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌పై KKR 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 201 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆరెంజ్ ఆర్మీ 16.4 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. క్లాసెన్ 33, కమిందు 27, నితీశ్ 19, కమిన్స్ 14 మినహా అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. వైభవ్, వరుణ్ చెరో 3 వికెట్లు, రస్సెల్ 2, హర్షిత్, నరైన్ చెరో వికెట్ తీశారు.

Similar News

News April 11, 2025

ప్రపంచంలో అత్యధిక టీబీ కేసులు భారత్‌లోనే: పరిశోధకులు

image

ప్రపంచంలోనే అత్యధిక క్షయ కేసులు భారత్‌లోనే నమోదవుతున్నాయని పలువురు పరిశోధకులు తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. క్షయపై చర్చించేందుకు హైదరాబాద్‌లో ప్రారంభమైన సదస్సులో వారు మాట్లాడారు. ‘క్షయ కారణంగా 2023లో 3 లక్షలమందికి పైగా కన్నుమూశారు. ముందే గుర్తిస్తే టీబీ మరణాన్ని అరికట్టొచ్చు. భారత్‌కు సవాలుగా మారిన దీనిపై అందరూ కలిసి పోరాడాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.

News April 11, 2025

వడ్డీ రాయితీ గడువు పొడిగింపు

image

AP: పట్టణాలు, నగరాల్లో ఆస్తి పన్ను బకాయిలపై 50 శాతం వడ్డీ రాయితీ గడువును ప్రభుత్వం ఈ నెల 30 వరకు పొడిగించింది. 2024-25కు గాను ప్రజలు చెల్లించాల్సిన పన్నుపై ఈ రాయితీ వర్తిస్తుంది. మార్చి నెలాఖరుతోనే గడువు ముగిసిన విషయం తెలిసిందే. అయితే సెలవుల వల్ల రాయితీ ఉపయోగించుకోలేకపోయామని విజ్ఞప్తులు రావడంతో పొడిగించింది.

News April 11, 2025

అంగన్‌వాడీ పిల్లలకు శనగలు, ఎగ్‌ఫ్రైడ్ రైస్

image

AP: అంగన్‌వాడీ కేంద్రాల మధ్యాహ్న భోజన మెనూలో ప్రభుత్వం మార్పులు చేయనుంది. రుచితోపాటు ఎక్కువ పోషకాలుండేలా పిల్లలకు వారంలో 2 రోజులు ఎగ్‌ఫ్రైడ్ రైస్, ఉదయం ఉడికించిన శనగలు అందించనుంది. అలాగే కూరల్లో మునగపొడిని వాడనుంది. ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా 4 జోన్ల పరిధిలోని ఒక్కో కేంద్రంలో అమలు చేశారు. త్వరలో 26 జిల్లాల్లోని ఒక్కో కేంద్రంలో అమలు చేస్తారు. బాలామృతంలోనూ చక్కెర స్థాయి తగ్గించి మార్పులు చేస్తారు.

error: Content is protected !!