News April 4, 2025
BREAKING: SRH ఘోర ఓటమి

SRH హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌పై KKR 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 201 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆరెంజ్ ఆర్మీ 16.4 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. క్లాసెన్ 33, కమిందు 27, నితీశ్ 19, కమిన్స్ 14 మినహా అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. వైభవ్, వరుణ్ చెరో 3 వికెట్లు, రస్సెల్ 2, హర్షిత్, నరైన్ చెరో వికెట్ తీశారు.
Similar News
News April 20, 2025
ఏం తప్పు చేశామో తెలియట్లేదు: పరాగ్

గెలవాల్సిన మ్యాచ్‌లో ఓడిపోవడం బాధ కలిగించిందని RR కెప్టెన్ రియాన్ పరాగ్ చెప్పారు. ‘మేం ఏం తప్పు చేశామో తెలియట్లేదు. 18-19 ఓవర్ వరకు మాదే గెలుపు అనుకున్నాం. 19 ఓవర్లోనే మ్యాచ్ పూర్తి చేసి ఉండాలి. ఈ ఓటమికి నాదే బాధ్యత. అలాగే మా బౌలింగ్‌లో చివరి ఓవర్ సందీప్ శర్మ ఎక్కువ రన్స్ ఇచ్చారు. అతను మంచి బౌలరే కానీ అతని బ్యాడ్ లక్. సమద్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు’ అని పేర్కొన్నారు.
News April 20, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News April 20, 2025
16,347 పోస్టులు: జిల్లాలు, సబ్జెక్టుల వారీగా ఖాళీలు ఇలా..

AP: రాష్ట్రంలో 16,347 పోస్టులతో ఇవాళ ఉ.10 గంటలకు మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనుంది. ఇందులో జిల్లా స్థాయిలో 14,088, స్టేట్, జోన్ లెవెల్‌లో 2,259 పోస్టులున్నాయి. అలాగే 7,487 స్కూల్ అసిస్టెంట్లు, 6,599 సెకండరీ గ్రేడ్ టీచర్ల ఖాళీలున్నాయి. 13 ఉమ్మడి జిల్లాలు, సబ్జెక్టుల వారీగా పూర్తి ఖాళీల వివరాల కోసం <
#SHARE