News April 4, 2025
BREAKING: రాజ్యసభలో వక్ఫ్ బిల్లుకు ఆమోదం

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వక్ఫ్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుకు అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. కాగా ఈ నెల 2న ఈ బిల్లు లోక్‌సభలో కూడా ఆమోదం పలికిన విషయం తెలిసిందే. సుదీర్ఘ చర్చ అనంతరం రాజ్యసభలో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. అర్ధారాత్రి దాటేవరకూ సభలో విస్తృత చర్చ జరిగింది.
Similar News
News April 15, 2025
గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు.. టీజీపీఎస్సీ క్లారిటీ

గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ కొందరు దురుద్దేశంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీజీపీఎస్సీ తెలిపింది. దీని వెనుక ప్రైవేటు కోచింగ్ సెంటర్లు ఉన్నాయని పేర్కొంది. ప్రోటోకాల్ ప్రకారమే నిపుణులతో వాల్యూయేషన్ చేయించినట్లు స్పష్టం చేసింది. లిమిటెడ్ మార్కుల పరీక్షల్లో ఒకే మార్కులు రావడం సహజమని తేల్చి చెప్పింది.
News April 15, 2025
పవన్ కుమారుడిపై అనుచిత వ్యాఖ్యలు.. నిందితుల అరెస్ట్

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల అగ్నిప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. ఆ అంశంలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై ప్రత్తిపాడు పీఎస్‌లో కేసు నమోదైంది. తాజాగా నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మార్క్‌తో పాటు పవన్ భార్యపైనా వీరు తప్పుడు పోస్టులు పెట్టినట్లు సమాచారం.
News April 15, 2025
UPDATE.. కింగ్‌డమ్ డబ్బింగ్ స్టార్ట్

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కింగ్‌డమ్’ మూవీ డబ్బింగ్ ప్రారంభమైనట్లు హీరో విజయ్ దేవరకొండ ఇన్‌స్టా స్టోరీలో తెలిపారు. ఇప్పటికే సగం పార్ట్ పూర్తయిందని వెల్లడించారు. విజయ్ స్టోరీని తెలియజేస్తూ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. మే 30న సినిమాను విడుదల చేసేందుకు దర్శకుడు-హీరో సిద్ధమయ్యారని రాసుకొచ్చింది.