News April 4, 2025

సమ్మర్‌లో బ్రేక్ ఫాస్ట్‌గా వీటిని తింటే?

image

ఎండాకాలంలో తేలికగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట ఇడ్లీ సాంబార్ తింటే ఆరోగ్యం సమతుల్యంగా ఉంటుంది. పెసరపప్పుతో చేసిన దోశల్లో ఫైబర్ ఎక్కువగా ఉండటంతో ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. రాగి జావలో కాల్షియం ఉండటంతో కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. కూరగాయలతో చేసిన ఉప్మా తింటే శరీరానికి బలం చేకూరుతుంది. పెరుగుతో కలిపి అటుకులు తింటే శరీరానికి పోషకాలు లభిస్తాయి.

Similar News

News April 12, 2025

టీపీసీసీకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు?

image

TG: TPCCకి నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లను నియమించాలని రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. BC సామాజిక వర్గ నేత మహేశ్ కుమార్ గౌడ్ ఇప్పటికే పీసీసీ చీఫ్‌గా ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రెడ్డి సామాజిక వర్గాలకు చెందిన నలుగురికి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా అవకాశాన్ని కల్పించే దిశగా కాంగ్రెస్ చూస్తున్నట్లు సమాచారం. మొత్తంగా పీసీసీని పూర్తిస్థాయిలో విస్తరించొచ్చని గాంధీభవన్ వర్గాలు పేర్కొన్నాయి.

News April 12, 2025

గూగుల్‌లో భారీగా కొలువుల కోత

image

గూగుల్ మరోసారి కొలువుల తొలగింపు ప్రారంభించింది. వందలాదిమందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తోంది. ప్రధానంగా ఆండ్రాయిడ్, పిక్సెల్ ఫోన్, క్రోమ్ బ్రౌజర్లలో పనిచేసే టెకీలపై వేటు వేసింది. చివరిగా 2023లోనూ 12వేలమందిని ఆ సంస్థ తొలగించిన సంగతి తెలిసిందే. ఆంక్షల యుద్ధాల నడుమ ప్రపంచ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో గూగుల్ బాటలోనే మరిన్ని సంస్థలు కొలువుల కోత బాట పట్టొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

News April 12, 2025

ఈ నెలలో భారత్‌కు అమెరికా ఉపాధ్యక్షుడు?

image

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ నెల 21 నుంచి 24 మధ్య భారత్‌కు సతీసమేతంగా వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సమయానికి అమెరికా జాతీయ భద్రతా సలహాదారు వాల్జ్ కూడా భారత్‌లోనే ఉండనున్నారు. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధానితో భేటీ అనంతరం వాన్స్ తన భార్యతో కలిసి జైపూర్, ఆగ్రా పర్యటిస్తారని సమాచారం. ఆయన భార్య ఉష భారత సంతతి మహిళ కావడం విశేషం.

error: Content is protected !!