News April 5, 2025
APPLY: టెన్త్ అర్హతతో 1,007 పోస్టులు

1,007 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ SESR (సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే) నోటిఫికేషన్ విడుదల చేసింది. నాగ్‌పూర్ డివిజన్‌లో ఫిట్టర్, కార్పెంటర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్, ప్లంబర్ తదితర పోస్టుల్లో ఖాళీలు ఉన్నాయి. టెన్త్‌లో 50 శాతం మార్కులతో పాటు ITI చేసి ఉండాలి. వయసు 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. https://secr.indianrailways.gov.in/ సైట్‌లో నేటి నుంచి మే 4 వరకు అప్లై చేసుకోవచ్చు.
Similar News
News September 12, 2025
అవినీతిని అడ్డుకునేందుకు AI మినిస్టర్.. ఎక్కడో తెలుసా?

ప్రపంచంలోనే ఏఐ ఆధారంగా పనిచేసే మంత్రిని అల్బేనియా దేశం నియమించింది. ఈ ఏఐ మహిళా మంత్రికి ‘డియెల్లా’ అని పేరు పెట్టింది. ఈమె అన్ని ప్రభుత్వ కొనుగోళ్లకు సంబంధించిన బాధ్యతలను పర్యవేక్షిస్తారు. దీనిద్వారా అల్బేనియా ప్రభుత్వం అవినీతిని తగ్గించొచ్చని భావిస్తోంది. అల్బేనియాలో ప్రభుత్వ టెండర్లు & ప్రజా నిధుల కేటాయింపుల్లో భారీగా అవినీతి జరుగుతుందనే ఆరోపణలున్నాయి. దీనిపై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి.
News September 12, 2025
PHOTOS: వే2న్యూస్ కాన్‌క్లేవ్-2025

AP: నేడు మంగళగిరిలో నిర్వహించిన Way2News కాన్‌క్లేవ్-2025 విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు.. రాజధాని అమరావతి, పోలవరం, పెట్టుబడులు, మెడికల్ కాలేజీలు ఇలా అనేక అంశాలపై తన విజన్‌ను వివరించారు. అటు వైసీపీ నుంచి సజ్జల, బుగ్గన తమ పాలనలో చేసిన పనులు, ఆలోచనలను పంచుకున్నారు. ఈ ప్రోగ్రామ్ ఫొటోస్‌ను పై గ్యాలరీలో చూడొచ్చు.
News September 12, 2025
రాజకీయాల్లోకి వెళ్లను: బ్రహ్మానందం

తనకు రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన లేదని కమెడియన్ బ్రహ్మానందం అన్నారు. ఆయన ఆత్మకథ ‘నేను మీ బ్రహ్మానందం’ పుస్తకాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఢిల్లీలో ఆవిష్కరించారు. బ్రహ్మానందం 30ఏళ్ల సినీ ప్రస్థానంలో వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించారని వెంకయ్య కొనియాడారు. తన జీవితం గురించి ఈ బుక్‌లో రాశానని బ్రహ్మానందం తెలిపారు. పేద కుటుంబం నుంచి వచ్చానని, లెక్చరర్‌గా పనిచేశానని చెప్పారు.