News April 5, 2025
అల్లూరి: గర్భిణిగా నాటకం ఆడిన మహిళ

అల్లూరి జిల్లా దేవిపట్నం మండలం ఇందుకూరిపేటకి చెందిన ఓ మహిళ కాన్పు కోసం రాజమండ్రిలోని ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చింది. అనంతరం అదృశ్యమైంది. ఆమెను కాకినాడ పోలీసులు గుర్తించారు. కాకినాడ జీజీహెచ్‌లో తనకు పుట్టిన పిల్లలను ఎవరో ఎత్తుకుపోయారని ఆమె చెప్పింది. గట్టిగా విచారించడంతో 9నెలలు గుడ్డ ముక్కలు పెట్టుకుని గర్భం పెరుగుతున్నట్లు నమ్మించినట్లు ఆమె తెలిపింది.
Similar News
News April 6, 2025
గుంటూరు: శోభా యాత్రకు పోలీస్ శాఖ ఏర్పాట్లు

గుంటూరు నగరంలో శ్రీరామ నవమి శోభాయాత్రను శాంతి యుతంగా నిర్వహించేందుకు పోలీసులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఎస్పీ సతీశ్ పలు ప్రధాన ప్రాంతాల్లో రూట్ మాప్‌ను స్వయంగా పరిశీలించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శోభా యాత్ర ముగియనున్న ఆర్ అగ్రహారం శ్రీ రామనామ క్షేత్రం వద్ద భద్రత కట్టుదిట్టంగా ఉండేలా సూచనలు ఇచ్చారు.
News April 6, 2025
వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా రేపు SCలో పిటిషన్: స్టాలిన్

వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకించిన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కీలక ప్రకటన చేశారు. దీనిని సవాల్ చేస్తూ రేపు సుప్రీంకోర్టులో డీఎంకే డిప్యూటీ జనరల్ సెక్రటరీ రాజా పిటిషన్ వేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే బిల్లును వ్యతిరేకిస్తూ MIM ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ జావేద్, ఆప్ ఎమ్మెల్యే అమనతుల్లా ఖాన్ SCని ఆశ్రయించారు.
News April 6, 2025
జియో వినియోగదారులకు ఆఫర్ పొడిగింపు

IPL సందర్భంగా జియో తమ ప్రీపెయిడ్ వినియోగదారులకు జియో హాట్‌స్టార్ యాక్సెస్‌ను ఫ్రీగా అందిస్తోంది. పలు రీఛార్జ్‌లపై గతంలో ప్రకటించిన ఈ ఆఫర్‌ను తాజాగా ఏప్రిల్ 15 వరకు పొడిగించింది. ఆలోగా ₹100/₹195/₹949తో రీఛార్జ్ చేసుకుంటే దాదాపు 90days యాప్ ఫ్రీగా చూడవచ్చు. ₹100 రీఛార్జ్‌కు 5GB డేటా, ₹195కి 15GB డేటా, ₹949తో రీఛార్జ్ చేసుకుంటే 84days వ్యాలిడిటీతో డైలీ 2GB డేటా, అన్ లిమిటెడ్ 5G డేటా&కాల్స్ పొందవచ్చు.